Followers

ఈ నెల 20 నుండి ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు, వార్డుకో హెల్త్ క్లినిక్ 



ఈ నెల 20 నుండి ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు, వార్డుకో హెల్త్ క్లినిక్ 


విమ్స్ లో మరిన్ని పడకలు ఏర్పాటు చేయాలి


డివిజన్ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలి


అధికార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ 


 


  విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


 

  ఈ నెల 20వ తేదీ నుండి ఫీవర్ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  కోవిడ్-19 పై ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు,  రాబోయే రోజుల్లో తీసుకోనున్న చర్యలు పై బుధవారం జివియంసి కమీషనర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, ఎఎంసి ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, విమ్స్ సంచాలకులు సత్య వర ప్రసాద్, తదితరులతో ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో వార్డుకో ఫీవర్ క్లినిక్  ఏర్పాటు చేయాలని, ఆ క్లినిక్ లో వైద్యులను ఏర్పాటు చేయాలని, అవసరమైనచో స్థానికంగా ఉన్న ఆర్.ఎం.పి.లను వినియోగించుకోవాలని జివియంసి కమీషనర్ జి. సృజనకు సూచించారు. జివియంసి పరిధిలోని 104 వాహనాలను వినియోగించుకోవచ్చునని చెప్పారు. వెరీ ఏక్టివ్ క్లస్టర్లో అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో డివిజన్ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటుచేసి ఎంపిడిఓ, సచివాలయం కార్యదర్శులకు అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబుకు సూచించారు.  మిమ్స్ లో మరిన్ని పడకలు ఏర్పాటు చేయాలని, సిప్టుల వారీగా వైద్యులు నుండి స్వీపర్ వరకు అందరూ తప్పకుండా విధుల్లో ఉండాలని విమ్స్ సంచాలకులు డా. సత్య వర ప్రసాద్ ను ఆదేశించారు.  అందరు నుండి హాజరు తీసుకోవాలని, బయోమెట్రిక్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  ప్రోటోకాల్ పాటించాలన్నారు.  విమ్స్ లో చేరిన పేషెంట్లు వారి బందువుల కాంటాక్టులను తీసుకోవాలని తెలిపారు.  ల్యాబ్ కు  వచ్చే శ్యాంపిల్స్ ను ఏ విధంగా చేస్తున్నదీ డా. కమల, డా. అప్పారావులను ఆయన అడుగగా ఆసుపత్రి నుండి తీసుకుంటున్న శ్యాంపిల్స్ ను రిజిస్టర్ లో నమోదు చేసి స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3ల గూర్చి వివరించారు.  శ్యాంపిల్స్ తీసుకున్నపుడే డేటా ఎంట్రీ చేసుకొని, స్టిక్కరింగ్ చేయాలని ఆయన ఆదేశించారు. ల్యాబ్ లో ఏ విధమైన సమస్య ఉన్నా తెలియజేయాలని చెప్పారు.  ప్రభుత్వ కంటి, గొంతు, ముక్కు ఆసుపత్రి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, రాణి చంద్రమతి దేవి, సైకియాట్రి ఆసుపత్రుల్లో అవసరమైన పనులు చేయాలని ఇఇ ఉమేష్ కుమార్ ను ఆదేశించారు.  నాలుగు ఆసుపత్రుల్లో చేపట్టవలసిన పనులకు సంబంధించి సార్ట్ టెండర్ పిలువాలన్నారు.  ఆక్సిజన్ లైన్ (సింగిల్) అన్నింటిలోను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  లైట్లు, ఫ్యాన్లు, టాయ్ లెట్లు, తదితరమైనవి మరమ్మత్తులు చేయాలన్నారు.  పేషెంట్లు వచ్చిన వెంటనే పల్స్ ఆక్సీని పరిశీలించాలని చెప్పారు. వెంటిలేటర్లు సరఫరా చేయాలని తెలిపారు.  అవసరమైన కిట్స్ మరిన్ని కొనుగోలు చేసి ఆసుపత్రులకు సరఫరా చేయాలని డిఎం అండ్ హెచ్ఓను ఆదేశించారు.  కెజిహెచ్ లో కొత్తగా నిర్మించిన ఆంకలాజికల్ బ్లాక్ కు అవసరమైన పనులు చేపట్టాలన్నారు. అందులో 300 పడకలు ఏర్పాటు చేయాలని, వెంటిలేటర్లు, ఆక్సీజన్ లైన్లు, ల్యాబ్, ఎక్స్- రే, మోనిటర్లు, లైట్లు, ఫ్యాన్లు, టాయ్ లెట్లు, బెడ్స్ తదితరమైనవి ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.  కె.జి.హెచ్. పర్యవేక్షకులు, ఎఎంసి ప్రిన్సిపాల్ తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్.ఇ. ఉమేష్ కుమార్ ను ఆదేశించారు. 108 వాహనాలు  అందుబాటులో ఉండాలని కో ఆర్డినేటర్ ను ఆదేశించారు.  ఫోన్ కాల్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించాలని చెప్పారు.

  ఈ సమావేశంలో జివియంసి కమీషనర్ జి. సృజన, విఎంఆర్డిఎ అదనపు కమీషనర్ మనజీర్ జిలానీ సమూన్, జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి.అరుణ్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, ఆంధ్రాయూనివర్సిటీ ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తిరుపతిరావు, విమ్స్ సంచాలకులు డా. కడలి సత్య వర ప్రసాద్, ల్యాబ్ డాక్టర్లు అప్పారావు, కమల, జివిఎంసి  సిఎంఓ డా. శాస్త్రి, అదనపు డిఎంహెచ్ఓ విజయ కుమారి, తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...