మాడుగుల ఆస్పత్రిలో కరోనా కలకలం
స్టాఫ్ నర్సుకు కరోనా పాజిటివ్.విధులకు విశాఖ నుంచి రాకపోకలు.
మంగళవారం రాత్రి నైట్ డ్యూటీ చేసిన స్టాఫ్ నర్స్.
వి మాడుగుల _పెన్ పవర్.
మాడుగుల సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కలకలం మొదలైంది. ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో గ్రామం ఉలిక్కిపడింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినా ఇంతవరకు ఒక్క కరోనా కేసు మండలం లోకి చేరలేదు. కానీ సి హెచ్ సి లో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న మహిళ విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తుంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్ళిన ఆమెకు అనారోగ్యం తలెత్తడంతో వైద్యం కోసం ఆస్పత్రిలో చేరింది. కోవిడ్ 19 లక్షణాలు కనిపించడంతో వైద్యులు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. శుక్రవారం ఉదయం ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు చెప్పడంతో ఈ విషయం మాడుగుల ఆసుపత్రికి చేరింది దీంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రోగులు కలకలం చెందారు. అప్రమత్తమైన వైద్యాధికారి ఆస్పత్రి పరిసరాలు శానిటైజెషన్ చేయించారు. స్టాఫ్ నర్స్ తో విధులు నిర్వహించిన సిబ్బంది కాంటాక్ట్ అయిన వారిని హోం క్వారంటైన్ కు పంపారు. స్టాఫ్ నర్స్ మూడు రోజుల క్రితం వరకు ఆస్పత్రికి రాకపోకలు సాగిస్తుంది.ఈమె వద్ద వైద్యం చేయించుకున్న వారు ఎవరు అన్నా దిశలో ఆరా తీస్తున్నారు.గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు అధికారులు విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కోవిడ్19 డైరెక్టర్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
No comments:
Post a Comment