Followers

రైల్వే ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలి


రైల్వే ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలి



డివైఎఫ్‌వై ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ వద్ద నిరసన



(పెన్‌పవర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌, ఒంగోలు)



రైల్వే ప్రవేటికరణను ఉపసంహరించుకోవాని డిమాండ్‌ చేస్తూ  ఒంగోలు రైల్వే స్టేషన్‌ దగ్గర డివైఎఫ్‌వై ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌వై నగర కార్యదర్శి కెఎఫ్‌ బాబు మాట్లాడుతూ ప్రజల  సంపదైన రైల్వేలను ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాని డిమాండు చేశారు. మోడీ 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ, బీజేపీ ప్రభుత్వం రెండవ సారి కూడా అధికారంలోకి రావడం జరిగిందన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు  సంగతి కాస్త మర్చిపోయారు. ప్రభుత్వ రంగం సంస్థను కార్పొరేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడమే పనిగా పెట్టుకున్నారు. దానిలో భాగంగానే రైల్వేను ప్రయివేట్‌ కంపెనీ చేతిలో పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక లాభాలను తెచ్చి పెడుతున్న 150 రైల్వే లైన్లను ప్రయివేటికరణ చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల  భవిష్యత్తులో యువకులకు ఉద్యోగ అవకాశాలు  లేకుండా పోతాయన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌వై నగర అధ్యక్షుడు పి కిరణ్‌, నాయకులు హరికృష్ణ, ఎం బ్రహ్మానందం, జి ఏడుకొండు, కె దాసు, తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...