సంజీవిని వాహనంలో కొవిడ్-19 పరీక్షలు
ముక్తేశ్వరం శ్రీ జయంతి రామయ్య పంతులు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం "సంజీవిని" వాహనంలో కొవిడ్-19 (కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించారు.
అయినవిల్లి , పెన్ పవర్
ఈ కార్యక్రమంలో అయినవిల్లి, వీరవల్లిపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు కుమారి బి.మంగాదేవి, ఎన్.సునీల్ సంజీవిని వాహనంలో గల వైద్య సిబ్బందితో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 120 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.
డాక్టర్లు మాట్లాడుతూ మండలంలో సుమారు 90 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి అని ఒక మరణం కూడా సంభవించిందని వ్యాధి ఉధృతమవుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించి వ్యాధి బారిన పడకుండా భౌతిక దూరం పాటిస్తూ చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలని జాగ్రత్తలు సూచించారు.
ఈ శిబిరాన్ని సందర్శించిన అయినవిల్లి మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు శ్రీమతి గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ కరోనా వైరస్ రోజు రోజుకు ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి వారు డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు వహిస్తు అలాగే వ్యాధి సోకిన వారిని అవమాన, అవహేళనలు చేయకుండా ధైర్యం చెప్పి డాక్టర్లు గాని వైద్య సిబ్బంది నర్సులు,ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు, వాలంటీర్స్,పారిశుధ్య కార్మికులు పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్, రెవిన్యూ వారు చేస్తున్న సేవలు అనిర్వచనీయం అని వారి కుటుంబ సభ్యులు ప్రాణాల సహితం ఫణంగా పెట్టి మన అందరి కోసం పాటుపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 45 వేల మందికి ఈ వైరస్ సోకిందని సుమారు 586 మంది చనిపోవడం వేరే వల్ల సోకిందని నిందించడం కన్నా ప్రతి ఒక్కరు ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో అయినవిల్లి మండలం ఎంపీడీవో శ్రీమతి కె.ఆర్ విజయ,జి.ఎం.సి.బాలయోగి చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు గంగుమళ్ళ శ్రీనివాస్,ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు,వాలంటీర్లు,రెవిన్య,పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment