15రోజులుగా ఎమ్మార్వో ఆఫీస్ లో సర్వర్లు పనిచేయడం లేదు
పూర్ణ మార్కెట్, పెన్ పవర్
విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గం, మహారాణి పేట,ఎమ్మార్వో ఆఫీస్ లో సర్వర్లు పని చేయక, చాలా సర్టిఫికెట్లు గత పదిహేను రోజులుగా పెండింగ్లో ఉన్నాయి. ప్రజలు రోజు ఎం.ఆర్.ఓ ఆఫీస్ కి వెళ్లి సర్టిఫికెట్లు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ లో అధికారులెవరు సీట్లలో ఉండటం లేదు. తాసిల్దార్ని అడిగితే ప్రోటోకాలింగ్ అని చెప్తున్నారు. దీని గురించి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల స్టాప్ కూడా ఇబ్బంది పడుతున్నారు.
No comments:
Post a Comment