Followers

క‌రోనా టెస్టుల్లో ఏపీ స‌ర్కార్ దూకుడు..15 నిమిషాల్లోనే ఫలితాలు..


క‌రోనా టెస్టుల్లో ఏపీ స‌ర్కార్ దూకుడు..15 నిమిషాల్లోనే ఫలితాలు..


క‌రోనా టెస్టుల విష‌యంలో ఇప్ప‌టికే దూసుకుపోతున్న ఏపీ ప్ర‌భుత్వం మ‌రింత జోరు పెంచింది. ఎమ‌ర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం వ‌చ్చినవారు క‌రోనా టెస్ట్ ఫ‌లితం కోసం ఎక్కువ స‌మ‌యం వెయిట్ చేయాల్సిన పనిలేదు. కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల్లోనే టెస్టుల రిపోర్ట్ తెలుసుకునేలా స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో కోవిడ్‌- 19 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌లను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కిట్‌లోని స్వాబ్‌తో తొలుత‌ ముక్కులో నుంచి జిగురును టెస్టు కోసం తీస్తారు. దానిని కిట్‌లోని లిక్విడ్‌లో మూడుసార్లు తిప్పి, ఆ స్వాబ్‌కు అతుక్కున్న మూడు చుక్కల ద్రవాన్ని కిట్‌పై వేస్తారు. 15 నిమిషాల త‌ర్వాత రిజ‌ల్ట్ తెలుస్తోంది. కిట్‌పై క‌ల‌ర్ మారితే కరోనా సోకిన‌ట్లు నిర్ధారిస్తారు. గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రుల‌కు ఎమర్జెన్సీ వైద్యం కోసం వచ్చే రోగులకు, యాక్సిడెంట్స్, ప్రసవాల చికిత్స కోసం వచ్చిన వారికి ఈ టెస్టులు చేయ‌నున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కిట్లు పంపిణీ చేశారు. అలాగే ఫ‌స్ట్ ఫేజ్ లో కర్నూలు జిల్లాకు 1,900 కిట్లు పంపారు. వీటిని కర్నూలు పెద్దాసుపత్రి, ఆదోని మాతాశిశు కేంద్రం, నంద్యాల జిల్లా ఆసుపత్రితో పాటు జిల్లాలోని 18 కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లకు పంపారు. గురువారం నుంచే ఈ కిట్ల ద్వారా ఎమ‌ర్జెన్సీ రోగులకు టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ రోగికి క‌రోనా సింట‌మ్స్ ఉండి, అతనికి నెగిటివ్ అని వ‌చ్చినా మళ్లీ ఆ వ్యక్తికి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...