ఏజెన్సీ 13 గ్రామాల ప్రజలను తరలించేందుకు
అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు
ప్రాజెక్టు నిర్వాసితుల గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి..
అర్హులైన అందరికీ అటవీ భూములపై సాగు హక్కు కల్పించేందుకు చర్యలు
సీజనల్ వ్యాధులు, వరదలపై, పునరావాస కాలనీ పనులపై సమీక్ష
పోలవరం పెన్ పవర్
అర్హులైన గిరిజనులకు అటవీ భూముల పై సాగు హక్కు కల్పించేందుకు అర్హులై న లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు సంబంధిత అధికారులను ఆదేశించారు .
శుక్రవారం పోలవరంలో సంబంధిత శాఖల అధికారులతో అటవీ భూములపై గిరిజనులకు సాగు హక్కు కల్పించేందుకు పట్టాల పంపిణీ, పోలవరం నిర్వాసితులకు పునరావాస కాలనీలలో జరుగుతున్న పనులపై , సీజనల్ వ్యాధులు వ్యాప్తి, వరదలు పై ఆయన సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సరానికి ముందు ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకుంటున్నారు వారిని ఈనెల 20వ తేదీలోగా గుర్తించి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి వక్కరికి అటవీ భూములపై సాగు హక్కు కల్పించేందుకు పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే సిద్ధం చేసిన జాబితా ను మరొకసారి పరిశీలించాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కొరకు నూతనంగా నిర్మించిన కాలనీలలో మిగిలి ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేసి ఈ నెలాఖరు నాటికి 13 కాలనీల కు ప్రజలను తరలించాలని ఆయన సంబంధిత ఏజెన్సీలకు ఆదేశించారు. మిగిలిన కాలనీలో పనులు కూడా త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ 13 గ్రామాలలోని ప్రజలను తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా అన్నీ గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేయాలన్నారు. వచ్చే 3 నెలలకు సరిపడే విధం మందులు సిద్ధం చేసుకోవాలన్నారు. ఐ టి డి ఏ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫోన్ రాగానే వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ కెంపులు నిర్వహించాలన్నారు. డెంగు,మలేరియా వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.వరదలు వస్తే తీసుకోవల్సిన ముందస్తు చర్యల పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ కె వెంకట్ రమణారెడ్డి ,, పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద్, ఐటీడీఏ పీ వో ఆర్ వి సూర్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఆర్డీవో శ్రీమతి ప్రసన్న లక్ష్మి, ఎస్సీ పంచాయతీ రాజ్ కే సుబ్రహ్మణ్యం , డిప్యూటీ డి యం &హే ఓ డాక్టర్ మురళి కృష్ణ , వివిధ శాఖల అధికారులు, ఈ ఈ లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment