Followers

100 రోజులుగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ


100 రోజులుగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ


 పూర్ణా మార్కెట్,పెన్ పవర్



రూపాకులవిశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ , శ్రీ  గాయత్రి వెల్ఫేర్ కల్చరల్  యూత్ అకాడమీ ,భారతీయ జనతా పార్టీ వైద్య విభాగము కలిసి నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ  100 వ రోజు ప్రకృతి చికిత్సాలయం మహారాణి పేట ఆవరణలో  జరిగిన , ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ రూపాకుల రవికుమార్  ముందుగా పేదలకు నిత్యావసర సరుకుల  బియ్యం, పప్పు, నూనె, గోధుమ పిండి,మొదలగునవి 100 మంది మహిళలకు పంపిణీ చేశారు.వారు ప్రసంగిస్తూ  గత 100 రోజులుగా పేదల కోసము ట్రస్ట్ చేస్తున్న సేవలను,ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు.ప్రధాని మోడీ పిలుపు మేరకు  లాక్ డౌన్  ముగిసే వరకు సహాయ కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. కరోనా కు వ్యాక్సిన్ లేదని,సామాజిక దూరం పాటిస్తూ  ఫేస్ మాస్క్  ధరించాలి అని, జ్వరము, దగ్గు, జలుబు, తలనొప్పి ఉన్నచో డాక్టర్స్ ని కలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  డా.శిష్ట్లా, శ్రీలక్ష్మి , డా. వై.లక్ష్మణ్ రావు, గౌతమ్,గేధల శ్రీహరి,రమణమ్మ , కొండమ్మ, శివ రామ్ మరియు అధిక సంఖ్యలో లబ్దిదారులు  పాల్గొన్నారు .


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...