మాస్కులు ధరించి కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు సహకరించండి.
..... గోకవరం పంచాయతీ కార్యదర్శి టి. శ్రీనివాసరావు
గోకవరం పెన్ పవర్.
మాస్కులు ధరించి కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు సహకరించండి. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శి టి .శ్రీనివాస రావు విలేకరులతో మాట్లాడుతూ గ్రామములోని కరోనా వైరస్ వ్యాప్తి అధికం కావడంతో ప్రజలందరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ వైరస్ వ్యాధి నిర్మూలనకు సహకరించాలని ఆయన కోరారు. ఇటీవల పద్దెనిమిదో తారీఖున 60 మందికి కరోనా టెస్టులు చేయగా వారిలో 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. పంచాయితీ పై అధికారుల ఆదేశాల మేరకు బాధితులు ఇంటివద్ద వారి వీధిలోనూ సోడియం హైపో క్లోరేట్ , కాల్షియం హైపోక్లోరైట్ ద్రవాన్ని పిచికారి చేయడం తో పాటు పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ చెల్లించి చుట్టుపక్కల ప్రాంతాలు ను శానిటేషన్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం గ్రామంలో ప్రతి ఒక్కరూ బయటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని లేనిచో 500 రూపాయలు ఫైన్ విధించబడుతుంది అని ఆయన తెలిపారు. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని అదేవిధంగా గా ఎక్కడపడితే అక్కడ జనాలు గుమిగూడి ఉండకూడదని గ్రామంలో ప్రజలు వైద్య సిబ్బందికి, అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు .
No comments:
Post a Comment