రెయిన్ గోడకూలి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
మాల మహానాడు నాయకుల జోక్యంతో ఆందోళన విరమణ.
సామర్లకోట. పెన్ పవర్:
సామర్లకోట రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఎ టి ఎం వద్ద డ్రెయిన్ ల పూడికతీత పనుల్లో నిమగ్నమై ఉన్న స్థానిక పెన్షన్ లైన్ కు చెందిన మామిడి యేసు(35)డ్రెయిన్ గోడకూలి దుర్మారం పాలయ్యారు.దానితో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహాసేన ,దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ,నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.వివరాల్లోకి వెళితే సామర్లకోట పెన్షన్ లైన్ కు చెందిన మామిడి యేసు స్థానిక రైల్వే స్టేషన్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడు గా పనిచేస్తున్నాడు.అయితే రోజు మాదిరిగానే విధుల్లో నిమగ్నమై స్థానిక రైల్వే స్టేషన్లలో ఎ టి ఎం వద్ద గల మేజర్ డ్రెయిన్ పూడికతీత పనులను చేపడుతుండగా డ్రెయిన్ పై నిర్మించిన ప్రహరీ శిథిలావస్థకు చేరుకోవడంతో విధుల్లో ఉన్న కార్మికుడు పై ఒక్కసారిగా కూలిపడింది.దానితో యేసు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ విషయం తెలుసుకున్న అతని భార్య,ఇద్దరు ఆడ పిల్లతో పాటు సంఘటన స్థలానికి చేరుకుంది.వారితోపాటు వారి బంధువులు మహాసేన నేత సరిపల్లి రాజేష్,వర్ధనపు లోవరాజు దళిత సంఘాల నాయకులు లింగం శివ ప్రసాద తదితరులు చేరుకుని ఆందోళన కార్యక్రమాన్ని చెప్పట్టారు ఆడ బిడ్డలతో ఉన్న కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్రప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహాసేన నేత సరిపల్లి రాజేష ,దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆడ బిడ్డలతో ఉన్న కార్మికుని కుటుంబాన్ని ఆదుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలిచ్చారు.దానితో రైల్వే అధికారులుతో పాటు సంబంధిత పారిశుద్ధ్య కాంట్రక్టరు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబం,దళిత సంఘాల నాయకులతో చర్చలు జరిపారు.దానితో కాంట్రక్టరు మృతుని కుటుంబానికి న్యాయం చేసేందుకు అంగీకరించడంతో బాధిత కుటుంబ బంధువులు,సంఘాల నాయకులు ఆందోళన విరమించారు.దానితో స్థానిక ఎస్ఐ సుమంత్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు.ఈ కార్యక్రమంలో మృతుని బంధువులు,దళిత సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment