పునరావాస గ్రామాల ప్రజలను తరలించే లోపే
పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలి.
ఐ టి డి ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి అనిల్ కుమార్
పోలవరం పెన్ పవర్
నిర్వాసితులకు సంబంధించిన ప్యాకేజీలు తలెత్తిన సమస్యలపై చర్చించేందుకు గురువారం పోలవరం మండలం స్థానిక సుజల గెస్ట్ హౌస్ కు ఆర్ అండ్ ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె గీతాంజలి విచ్చేసారు. వివిధ సమస్యలతో ప్యాకేజీలు, పునరావాస లు, ఇల్లు, పొలాలు, జీరో అకౌంట్, అకౌంట్ ఫెయిల్ తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్వాసితులు సంబంధిత పత్రాలతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం ఐ టి డి ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను నియమించారని అయితే గురు, శుక్రవారం రెండు రోజులలో నిర్వాసితుల సమస్యలు తీరవని, పునరావాస గ్రామాల ప్రజలను తరలించే వరకు వారానికి ఒకరోజు అయిన పునరావాస గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాలరాజు కోరారు . పునరావాస గ్రామాల ప్రజల సమస్యలపై త్వరితగతిన స్పందించి ప్యాకేజీ, ఇల్లు, చెట్టులు, భూమికి భూమి, ఎకౌంట్స్ ఫెయిల్యూర్ వంటి సమస్యలతో ప్యాకేజీ అందక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు అని వారందరి సమస్యలను త్వరితగతిన పూర్తిచేసి పునరావాస గ్రామాల ప్రజలను తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. పునరావాస గ్రామాల ప్రజలకు ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని ఆయన అన్నారు. పునరావాస గ్రామాల ప్రజలను తరలించే లోపే సమస్యలపై పూర్తి పరిష్కారం కావాలని కోరారు.
No comments:
Post a Comment