ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు వేర్పాటువాదులు హతం
అరుణాచల్ ప్రదేశ్ లో చాలా కాలం తర్వాత తుపాకుల మోత వినిపించింది. తిరాప్ జిల్లా ఖోన్సా ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌటర్ లో ఆరుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. నాగా వేర్పాటువాద సంస్థ అయిన నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్ (ఎన్ ఎస్ సీ ఎన్) ఐ ఏం సభ్యులు జరిపిన కాల్పుల్లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు గాయపడ్డాడని డీజీపీ ఆర్పీ ఉపాధ్యాయ తెలిపారు. నిఘా వర్గాల సమాచారంతో అస్సాం రైఫిల్స్‌కు చెందిన బలగాలు, అరుణాచల్‌ప్రదేశ్ పోలీసులు ఉమ్మడిగా తిరాప్ జిల్లాలోని ఖోన్సా ప్రాంతంలో గాలింపు చేపట్టాయని డీజీపీ తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 తుపాకులు, రెండు చైనీస్ ఎంక్యూ, 5 కిలోల పేలుడు పదార్థాలు, ఒక కిలో ఐఈడీ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
No comments:
Post a Comment