ఆధార్ సెంటర్ వద్ద నిర్లక్ష్యం తగదు*
*పెద్దాపురం ఎస్సై బాలాజీ*
*పెద్దాపురం ఆంధ్ర బ్యాంక్ లో ఆధార్ సెంటర్ నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం*
పెద్దాపురం ,పెన్ పవర్
స్థానిక ఆంధ్ర బ్యాంక్ ఆవరణంలో ఉన్నటువంటి ఆధార్ కేంద్రం వద్ద జనం రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా
అధికారులు బ్యాంకు వారికి ఆధార్ సెంటర్ నిర్వహిస్తున్న వారికి సూచనలు సలహాలు ఇచ్చి ఆధార్ సెంటర్లో శానిటైజర్లు రౌండ్ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని. ఆరడుగుల సామాజిక దూరం ఉండేలా చూడాలని తెలిపినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా వారిపని వారు నిర్వహిస్తున్నారు . కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న ఏమాత్రం లెక్కచేయకుండా ఎవరికి వస్తే మాకేంటి అనే ధోరణి లో వారు వ్యవహరించడం బాధాకరం. అయితే బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఆధార్ సేవలు పొందే వారిని కూర్చోబెట్టాలని మెగా ఫోన్ ద్వారా వారికి టోకెన్స్ ఏర్పాటు చేసి వారికి టోకెన్స్ ఇవ్వాలని అధికారులకు తెలిపినప్పటికీ అలా కాకుండా లైన్లో నుంచోపెట్టి సేవలందిస్తున్నారు అయితే దానివల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదని. ఆధార్ కి బ్యాంకు ఓకే ప్లేస్ వలన ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పడం లేదని వచ్చిన వినియోగదారులు తెలిపారు. *మరోసారి అధికారుల దృష్టికి* ఆంధ్ర బ్యాంక్ ఆవరణంలో నిర్వహిస్తున్నటు వంటి ఆదర్ సెంటర్లో దగ్గరదగ్గరగా ఉంటున్నారనే సమాచారం మేరకు అధికారులు అప్రమత్తమై తక్షణం అక్కడ సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎస్సై ఏ బాలాజీని ఆదేశించగా సచివాలయ సిబ్బందితో పాటు అక్కడికి వెళ్లి సమస్యని పరిష్కరించడం జరిగింది. నాల్గవ సచివాలయం వీఆర్వో లక్ష్మి మహిళా పోలీస్ సూర్యకుమారి. వాలంటీర్స్ ఎస్.నళిని. శీను. గౌరీ. శుభ .తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment