నగరంలో కలకలం రేపుతున్న మాదకద్రవ్యాల రాకెట్.
భారీ డ్రగ్స్ తో నలుగురు వ్యక్తులు అరెస్ట్.
గోవా బెంగళూరు నుంచి విశాఖ చేరుతున్న డ్రగ్స్.
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
విశాఖ నగరంలో మాదక ద్రవ్యాలు కలకలం రేపుతోంది, టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేశారు. భారీ ఎత్తు డ్రగ్స్ తో నలుగురిని అరెస్టు చేశారు. నగరంలో కరోనా మహమ్మారి విలయ తాండవం ఆడుతుంటే మరోవైపు డ్రగ్స్ మాఫియా వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డారు. గోవా బెంగళూరు నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విశాఖపట్నంలో సరఫరా చేస్తూ నిందితులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే సీతమ్మ పేట నాయుడు వీధికి చెందిన మనుకొండ సత్యనారాయణ(26) సాలిగ్రామ పురం నరసింహ నగర్ కి చెందిన మజ్జి అజయ్ కుమార్(24) బాలయ్య శాస్త్రి లేఔట్ చెందిన కంది రవికుమార్(22) కంచరపాలెం సుభాష్ నగర్ కి చెందిన కేతి మనోజ్ స్వరూప్ లను టాస్క్ఫోర్స్ పోలీసులు ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 61 ఎల్ ఎస్ డి స్టిక్కర్లు 2.5 గ్రాముల ఎం డి ఎం ఏ గంజాయి 60 గ్రాములు 9500 రూపాయల నగదు స్వాధీనపరచుకున్నారు. 429/ 2020. 21 బి 27 ఏ 20 బి 2 ఏ మాదకద్రవ్యాల (1985)చట్టం కింద కేసులు నమోదు చేశారు. మను కొండ సత్యనారాయణకు గంజాయి డ్రగ్స్ అలవాటు ఉంది. ఏజెన్సీ నుంచి శీలవతి గంజాయి ది తక్కువ ధరకు కొనుగోలు చేసి మజ్జి అజయ్ కుమార్ గోవా బెంగుళూరు తరలించి విక్రయిస్తుంటారు. ఈ నెల 24న అజయ్ కుమార్ బెంగళూరు వెళ్లి సత్యనారాయణతో కలిశాడు. ఎల్ ఎస్ డి బ్లాట్స్ 70 ఎం డి ఎం ఏ మూడు గ్రాములుతొ అజయ్ కుమార్ 27న విశాఖ చేరుకున్నారు 30 న సత్తిబాబు బెంగళూరు నుంచి విశాఖ వచ్చాడు. కంది రవికుమార్ సూచించిన కేతి మనోజ్ స్వరూప్ కి ఎం డి ఎం ఏ 3 గ్రాములు ఐదు వేల రూపాయలకు ఇస్తుండగా కైలాస్ పురం ఫోర్ట్ హై స్కూల్ వద్ద పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నగరంలో డి ఐ జి గౌతమ్ సేవక్ ఈ పర్యటనలో ఉన్న సమయంలో డ్రగ్ రాకెట్ పట్టుబడటం విశేషం. పోలీసు బాస్ లు నగర పర్యటన ఉండగా భారీ ఎత్తున డ్రగ్స్ పాటుపడడం పోలీసులకు సవాల్ విసిరినట్లు అయింది. ఈ డ్రగ్ రాకెట్ పై విచారణ సాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.
No comments:
Post a Comment