కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు
సీఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
పరవాడ పెన్ పవర్
పరవాడ:కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలపై సిఐటియు మరియు ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.మండలం లోని దేశపాత్రుని పాలెం సచివాలయం వద్ద సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ,ఐద్వా మండల నాయకురాలు పి.మాణిక్యం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.కరోనా విజ్రంభిస్తున్న తరుణంలో ప్రజలను ఆదుకోవాలి అని ప్రతి కుటుంబానికి 7500 రూ కుటుంభం లో ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం ఆరునెలల పాటు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.కార్మిక చట్టాల మార్పును విరమించాలి అని కరోనా కాలంలో కూడా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రక్షణ ఇన్స్యూరెన్స్ కల్పించాలి అని ఉపాధి హామీ పనులు పట్టణాల్లో ఉన్న పేదలకు కూడా కల్పించాలి అని నినాదాలు చేశారు.కరోనా విపత్తులో ప్రజలను అదుకోవలిసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలూ పూర్తిగా విఫలమయ్యాయి అని కరోనా టెస్టుల్లో నాణ్యత కానీ కరోనా సోకిన వారికి వైద్య సదుపాయాలు అందిచడం లో ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు నాయకులు వి.వి శ్రీనివాసరావు,వి.రమణ,పారిశుద్య కార్మికులు,ఇతర రంగాల కార్మికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment