Followers

ఘనంగా బిఎంఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు





ఘనంగా బిఎంఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు


         


పరవాడ పెన్ పవర్


 

పరవాడ; భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక  దినోత్సవ వేడుకలను సింహాద్రి ఎన్టీపీసీ మెయిన్ గేట్ వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాసుపల్లి సోమశేఖర్, బి ఎం ఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు మళ్ల జగదీశ్వర రావు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 1955లో ఏర్పడిన బి ఎం ఎస్ దేశంలోనే అత్యధిక సభ్యులతో అతిపెద్ద యూనియన్ గా అవతరించిందని అన్నారు. పారిశ్రామిక కార్మిక విధానాలను రూపొందించి  దేశంలోనే బలమైన యూనియ న్ గా స్థాపించడానికి బి ఎం ఎస్ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.రమణ, జి నాగభూషణం ఎం. శ్రీను, కె. సత్యనారాయణ,ఎల్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...