వీరేపల్లి లో ఇసుక నిల్వ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మురళి
పెన్ పవర్, ఉలవపాడు
మండలం లోని వీరేపల్లి మార్కెట్ యార్డ్ ను జాయింట్ కలెక్టర్ మురళి మంగళవారం నాడు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం.గా చేపడుతున్న ఇసుక నిల్వ కేంద్రాల పరిశీలనలో భాగంగా వీరే పల్లి మార్కెట్ యార్డ్ ఇసుక నిల్వ చేయడానికి అనువైన ప్రాంతంగా ఉందని పరిశీలనలో ఆయన తెలిపారు. రాబోయే వర్షాకాల సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎక్కువ పడకుండా నెల్లూరు జిల్లా లోని సంఘం తదితర దగ్గర ప్రాంతాలనుంచి ఇసుకను తరలించి వీరేపల్లి మార్కెట్ యార్డులో నిల్వ చేసి ప్రజలకు తక్కువ ట్రాన్స్పోర్ట్ చార్జీలు వర్తించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నరసింహారెడ్డి,అసిస్టెంట్ డైరెక్టర్ డి జగన్నాద రావు, తహసిల్దార్ పి మరియమ్మ, వ్యవసాయ అధికారి ఎం.మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment