వైరస్ నియంత్రణకు రహదారులను మూసివేస్తున్న ప్రజలు
పాయకరావుపేట,పెన్ పవర్
తునిలో కరోనా పాజిటివ్ కేసులు అతివేగంగా పెరుగుతున్న సందర్బంగా ఆ ప్రభావం పేట ప్రజలమీద పడకుండా వైరస్ నియంత్రణకు గ్రామ పెద్దలు,వివిద పార్టీలకు చెందిన రాజకీయనాయకులు రహదారుల మూసివేత నిర్ణయంతీసుకొన్నారు. ఈమేరకు వారు పాయకరావుపేట నుండి తుని మార్కెటుకు వెళ్ళే తాండవ నది బ్రిడ్జి ని బార్ గేట్లతో మూసేసారు.అదేవిదంగా నర్సీపట్నం జంక్షన్ నుండి పాయకరావుపేట పట్టణంలోనికి వచ్చే లింగాలకాలనీ మెయిన్ రోడ్డును కూడా మూసేసారు.ప్రయాణ అసౌకర్యానికి చింతించక సహకరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గూటూరి శ్రీను,దనిశెట్టి తిరుమలేశ్వర్రావు,జగతా శ్రీనివాస్ ,ఇంజరపు సూరిబాబు,ఐఎన్ మూర్తి,రాజా రమేష్ ,పెంకే శ్రీను,జగతా ప్రసాద్ మరియు పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment