Followers

కరోనాను జయించిన పోలీసులకి ఘన స్వాగతం


కరోనాను జయించిన పోలీసులకి ఘన స్వాగతం


 పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి: 


కరోనా పై పోరాడి విజయం సాధించి తిరిగి విధుల్లో చేరుతున్న కందుకూరు పోలీసులు  శంకర్, రఫీ లకి కందుకూరు పట్టణ పోలీసు స్టేషన్ లో పూలతో ఘన స్వాగతం పలికారు. కొన్ని రోజుల క్రితం  కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరు కానిస్టేబుళ్లు కు పాజిటివ్ వచ్చింది.వారిరువు కోలుకొన్నారు. గురువారం  విధుల్లో కి చేరడానికి వచ్చిన సందర్భంగా కందుకూరు కందుకూరు డి ఎస్ పి కండే శ్రీనివాసులు, సి ఐ  ఎం.విజయ్ కుమార్ నేతృత్వంలో రూరల్ ఎస్సై  కె. అంకమ్మ మరియు పోలీసు సిబ్బంది పూలతో ఘన స్వాగతం పలికి,పుష్ప గుచ్ఛం ఇచ్చి పోలీసు స్టేషన్ లోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కందుకూరు డి ఎస్ పి  కండే శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనాని జయించిన పోలీసు వారిలో మనో ధైర్యాన్ని నింపటానికి ఈకార్యక్రమం చేపట్టామని అన్నారు.కరోనా పట్ల ప్రజలు అవగాహనతో,పరిశుభ్రతలు పాటిస్తూ,అనవసరంగా బయటకు రాకుండా,ఒకవేళ అవసరముండి వస్తే సామాజిక దూరం పాటిసిస్తూ,బయట ఆహారం తీసుకోకుండా,సమయానికి ఇంటిలోని ఆహారం తీసుకొంటూ, కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటే కరోనా మన దరిచేరదు.ఒకవేళ కరోనా బారిన పడ్డా త్వరగా కొలుకొనవచ్చు అని డి ఎస్ పి  శ్రీనివాసులు అన్నారు. పోలీసులు ఒక్కరు ఇలా కోవిడ్ ను జయించి విధులకు రావడం సంతోషం గా ఉందని,  ఎస్సై తిరుపతిరావు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...