Followers

నాటుసారా కేంద్రాలపై పోలీస్, ఎక్సైజ్ అధికారులు దాడులు


నాటుసారా కేంద్రాలపై పోలీస్, ఎక్సైజ్ అధికారులు దాడులు


పోలవరం పెన్ పవర్


పోలవరం మండలం కొమ్ము గూడెం గ్రామంలో పోలవరం సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ శీను స్టేషన్ సిబ్బందితో శుక్రవారం రాత్రి  నాటుసారా తయారీ కేంద్రాలపై జాయింట్ ఆపరేషన్ చేసినట్లు పోలవరం ఎక్సైజ్ సి ఐ జి సత్యనారాయణ తెలిపారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న ఎనిమిది వందల లీటర్ల పులిసిన బెల్లపు ఊట ధ్వంసం చేసి 45 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన గుగ్గులోతు పోచమ్మ, గుగ్గులోతు సురేష్ లను అరెస్ట్ చేసి కేసు నమోదు వేసినట్లు ఎక్సైజ్ సి ఐ జి సత్యనారాయణ తెలిపారు. నాటుసారా  తయారీ, రవాణా, అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ, పోలవరం సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ శ్రీను, కానిస్టేబుల్ మోహన్, వెంకట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ రాజా, సందీప్ పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...