మిధిలా పురి సూపర్ మార్కెట్లో అగ్నిప్రమాదం
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
నగరంలోని మధురవాడ మిధిలా పూరి హుడా కాలనీలో ఎం వి ఎస్ సూపర్ మార్కెట్ లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. సర్క్యూట్ వల్ల చాలా రేగిన మంటల్లో విలువైన సరుకులు వస్తువులు సామాన్లు కాలి బూడిద అయ్యాయి. హఠాత్తుగా మంటలు ఏర్పడటంతో ఫైర్ ఇంజన్ లు వచ్చే సమయానికి మంటలు అల్లుకు పోయాయి. దీంత మంటలు అదుపు చేయడం ఫైర్ సిబ్బంది కి సాహసం గా మారింది. సుదీర్ఘ సమయం సాహసం చేసి మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనాలు వేశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో చుట్టుపక్కల పెను ప్రమాదం తప్పింది.
No comments:
Post a Comment