కాపుల ఐక్యతతో హక్కుల సాధన
ఉత్తరాంధ్ర కాపునాడు అధ్యక్షుడు రవీంద్రనాధ్ ఠాగూర్
గాజువాక, పెన్ పవర్
ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యపడుతుంది అని ఇటీవల ఉత్తరాంధ్ర కాపునాడు అధ్యక్షుడిగా నియమితులైన పులపా రవీంద్రనాధ్ ఠాగూర్ అన్నారు.గాజువాక 67,68 వార్డుల కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాజువాక హైస్కూల్ రోడ్డులో రవీంద్రనాధ్ కు అభినందన సత్కార కార్యక్రమం బుధవారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని కోరారు.కాపు కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు,నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.కాపు నేస్తం ద్వారా లభిదారులకు చేయూతనిచ్చిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు గుంటూరు శంకరరావు,ఈటి శ్యామలరావు,సూర్యనారాయణ,గోపి,ధర్మా
No comments:
Post a Comment