వాలంటీర్ పై దాడి.
పెన్ పవర్, వలేటివారిపాలెం
మండల పరిధిలోని సింగమనేని పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి గ్రామ వాలంటీర్ శివరాం పై ఇరువురు దాడిచేసి గాయపడినట్లు శివరాం తెలిపారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన యలమంద, రమేష్ లు రేషన్ కార్డు విషయమై, అలాగే రేషన్ బియ్యం విషయంలో వాదోపవాదాలు జరిగాయి. శివరాం పై భౌతిక దాడికి దిగినట్లు బాధితుడు శివరాం తెలిపారు. దీంతో గాయాలపాలైన శివరాం కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు శివరాం తెలిపారు. కందుకూరు ఏరియా వైద్యశాలకు చికిత్సకోసం వెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు సూచించగా అంబులెన్స్లో శివరాం వెళ్లారు. కడుపు నొప్పి ఎక్కువగా ఉండటంతో పరీక్షలు చేసిన వైద్యులు మూడు రోజులు ఇక్కడే ఉండాలని ఇచ్చినట్లు శివరాం తెలిపారు. తనపై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షించాలని శివరాం కోరారు
No comments:
Post a Comment