అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తాo
కొత్త రేషన్ కార్డు దారులకు కూడా....m r o
కామేశ్వరరావు..(టంగుటూరు జరుగుమల్లి) జూన్ 27... జరుగుమల్లి మండలం లోని20 పంచాయితీల పరిధిలోని అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. రెండో విడత క్రింద 231 మంది ఇళ్ల స్థలాల కొరకు అర్జీలు మాకు అందాయని దానిలో భాగంగా పది గ్రామాల్లో భూ సేకరణ ప్రారంభించామని త్వరితగతిన పూర్తిచేసి అర్హులందరికీ స్థలాలు కేటాయిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ మండలంలో దాదాపుగా కొత్త రేషన్ కార్డు కొరకు 181 మంది అర్జీలు పెట్టుకోవటం జరిగిందని వారికి పది రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డు అందజేయడం జరుగుతుంది అని అలాగే ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే రేషన్ కార్డు కు అర్జీ పెట్టుకోవాలి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీనాథ్ ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment