అక్రమ వ్యాపారాలపై దృష్టి సారించండి
చింతపల్లి జూన్ 24 పెన్ పవర్
గ్రామాలలో అక్రమ వ్యాపారాలు, రవాణాపై నియంత్రించాలసిన బాధ్యత గ్రామ వాలంటీర్లు, సచివాలయ మహిళా పోలీసులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక ఎక్సైజ్ సి.ఐ సింహాద్రి అన్నారు. బుధవారం మండలంలోని లోతు గెడ్డ పంచాయతీ కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ శ్రీమతి కె ఉషశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అక్రమ గంజాయి రవాణా, నాటు సారా తయారీ, విక్రయాలు, గొలుసు మద్యం వ్యాపారాల నియంత్రణపై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని నియంత్రించాలన్నారు.నాటు సారా సేవించడం వలన బంగారం లాంటి కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. గంజాయి విక్రయం, రవాణా వంటి వాటి వల్ల భవిష్యత్ నాశనం అవుతుం దన్నారు .ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గిరిజనుల ఆహారపు అలవాట్ల పై అవగాహన పెంపొందించాలన్నారు. కాచి, వడపోసిన మంచినీటిని సేవించాలని, వేడివేడి ఆహార పదార్థాల తీసుకునేలా గిరిజనులకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. ఇళ్ల వద్ద పశువులను ఉంచరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు. గ్రామాలలో అభివృద్ధి, సమస్యలపై దృష్టి సారించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment