Followers

ప్రజారోగ్య విభాగపు పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలి

ప్రజారోగ్య విభాగపు పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలి జి.వి.ఎం.సి. అధనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు


 


విశాఖపట్నం, 


 


ప్రజారోగా విభాగంలోని క్షేత్రస్థాయి అధికారులు ముఖ్యంగా, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, మేస్త్రీలు వారి పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని జి.వి.ఎం.సి. అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు కోరారు. జి.వి.ఎం.సి. కమీషనర్ ఆదేశాల మేరకు, ఆయన ప్రధాన కార్యాలయపు సమావేశ మందిరంలో సి.ఎం.ఓ.హెచ్.తో కలసి సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్య శాఖకు సంబందించి వివిధ అంశములపై కూలంకుశంగా చర్చించారు. ట్రేడ్ లైసెన్స్ ఆదాయాన్ని మరింత పెంచాలని, క్రొత్తగా ఏర్పడుచున్న చిల్లర, టోకు వ్యాపారాలను గుర్తించి, వెంటనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు మధించాలన్నారు. వ్యాపారాలలో మార్పులు చేస్తే (under assessed) వాటిని సరి దిద్ది లైసెన్స్ ఫీజు పెంచాలన్నారు. ఇప్పటి వరకు బకాయి పడ్డ వ్యాపారస్తుల వద్ద నుండి బకాయిలు రాబట్టాలన్నారు. జి.వి.ఎం.సి. యు.సి.డి. విభాగంలోగల సుమారు 13000 వీధి విక్రయ దారుల జాబితాలను, జి.ఎస్.టి. చెల్లిస్తున్న వ్యాపార సంస్థల వివరాలను జోనల్ వారీగా సేకరించి ట్రేడ్ లైసెన్స్ ఫీజు మధించాలన్నారు. ప్రజారోగ్య విభాగంద్వారా ప్రజలకు అందించే సేవలుగాని, ప్రజా ఫిర్యాదులు గాని, వార్డు సచివాలయాలు ద్వారా స్వీకరించాలన్నారు. ఏ అధికారి కూడా వ్యక్తిగతంగా స్వీకరించ కూడదన్నారు. వాటిని పెండింగులో ఉంచకుండా త్వరిత గతిని పరిష్కరించాలన్నారు. విద్యుత్ శాఖ వారు కొట్టి పడేస్తున్న మొక్కల కొమ్మలను, ఆ శాఖ అధికార్లతో సమన్వయము చేసుకొని ఎత్తిపారవేయాలన్నారు. కాలువల్లో పూడికలను ఇంజినీరింగ్ శాఖ వారు తీయిస్తే, ఆ కాంట్రాక్టరు ద్వారా, శానిటరీ విభాగంవారు తీయిస్తే సిబ్బంది ద్వారా అదే రోజు ఎత్తి పారవేయాలన్నారు. బిల్డింగ్ మెటీరియల్ రోడ్ల ప్రక్కన కనబడితే, ప్రణాళిక విభాగానికి తెలియపర్చాలన్నారు. వర్షా కాలంలో వచ్చే, సీజన్ వ్యాధులు, స్వైన్ ఫ్ల్యూ, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటివి ప్రబల కుండా, తగు జాగ్రత్తలు పాటించాలని, వార్డుల్లో చెత్తను ప్రతీ రోజు ఎత్తివేసి, కాలువలు శుభ్రం చేస్తే, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ప్రతీ ఇంటి దగ్గర చెత్తను వేరుచేసి, పారిశుద్య సిబ్బంది స్వీకరిస్తే, రోడ్లపై చెత్త కనపడదు. గావున , క్రమ తప్పకుండా, ఈ విధానాన్ని అందరూ ఆచరించాలన్నారు. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. వార్డు ప్రత్యేకాధికారులతో కలసి, వీధుల్లో పర్యటించి ప్రజలకు అంటూ వ్యాధులపై, కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించాలన్నరు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...