జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గొల్ల బాబురావు
ఎస్.రాయవరం, పెన్ పవర్.
సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న జర్నలిస్టులకు తనవంతు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. గురువారం ఉదయం అడ్డ రోడ్ లోని ఫంక్షన్ హాల్ లో నియోజక వర్గ విలేకరులతో సమావేశమైన ఆయన జర్నలిస్టుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాసంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు వినూత్నమైన రీతిలో ప్రవేశపెట్టారని, అందులో జర్నలిస్టులను భాగస్వాములు చేస్తామన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపునకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.జూన్ 8న పట్టాలు ఇవ్వడంతోపాటు లబ్ధిదారులు ఇచ్చే రెండు సెంట్లు కంటే అదనంగా మరొక సెంటు ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుంటానని స్పష్టమైన హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తన వద్దకు సమయంలో నేను వచ్చి చెప్పవచ్చునని సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని తెలిపారు. హెట్రో సౌజన్యంతో నిత్యావసర సరుకులను జర్నలిస్టులకు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు వీసం రామకృష్ణ , మధువర్మ రాజు రెండు సంఘాలు జర్నలిస్టులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment