పేద బ్రాహ్మణులకు చేయూత
పూర్ణా మార్కెట్, పెన్ పవర్
ఈరోజు దక్షిణ నియోజకవర్గం పరిధిలో పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైశాఖి జల ఉద్యానవనం పార్కు" యజ్ఞ వల్క పరిషత్"... విశాఖపట్నం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పి. జగన్నాధ రావు, ఆర్థిక సహాయంతో కరోనా లోక్ డౌన్ వలన ఎటువంటి ఆధారము లేని బ్రాహ్మణులకు 200 మందికి బియ్యము పప్పు దినుసులు నూనె ఇతర కిరాణా సరుకులు, వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చేతుల మీదగా పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, అర్హులైన ప్రతి పేదబ్రాహ్మణ కుటుంబానికి 5000/- రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సందర్భంగా తెలియజేశారు, కరోనా వ్యాధి... నిర్మూలన మన చేతుల్లోనే ఉందని కనుక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, విధించిన ఆంక్షలను ప్రతి ఒక్కరూ పాటించి వ్యాధి నిర్మూలనకు దోహద పడాలని కోరారు,
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కార్యదర్శులు కమిటీ సభ్యులు వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment