Followers

 తాజా పరిస్థితులపై ఎమ్మెల్యే గ్రంధి సమీక్ష

 


 


 తాజా పరిస్థితులపై ఎమ్మెల్యే గ్రంధి సమీక్ష..


భీమవరం, పెన్ పవర్


భీమవరం కరోనా వైరస్ కట్టడిలో భాగంగా అధికారులు తీసుకుంటున్న చర్యల పర్యవేక్షణలో భాగంగా స్థానిక క్యాంపు కార్యాలయంలో తహశీల్దార్ రమణరావు, మున్సిపల్ కమీషనర్ కె రమేష్ కుమార్, వన్ టౌన్ సిఐ కృష్ణ భగవాన్ లతో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల పట్టణంలో మూడు పాజిటివ్ కేసులు నమోదైన నేపధ్యంలో మూడు రోజులు పట్టణ బంద్ కు పిలుపునివ్వగా బంద్ ఎలా జరిగింది, దాని యొక్క ప్రభావం ఏమిటనే దానిపై అధికారులను ఆరా తీసారు. అదే మాదిరిగా పట్టణంలో ఉన్న రెడ్ జోన్లలో సూపర్ శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ నివసిస్తున్న ప్రజల ఇబ్బందులపై అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ముందుగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిద్దరికీ కూడా చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో వారు ప్రస్తుతం హెం క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. నేటి నుండి మరో మూడు రోజులు పాటు పట్టణంలో బంద్ ను ప్రకటించాలని చాలా మంది కోరుతున్నారని, కాని జిల్లాను ఆరెంజ్ జోన్ గా ప్రకటించిన నేపధ్యంలో ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను అనుసరించి బంద్ పై నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరోనా కట్టడిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనియమని ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పని చేసి భీమవరంలో కరోనా అనేది లేకుండా చేయాలని ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ మూడు మీటర్ల భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. యధావిధిగానే కాయగూరల షాపులు, కిరాణా షాపులు ప్రభుత్వం ప్రకటించిన సమయంలోనే తెరిచి ఉంచాలని అన్నారు. మాంసాహర మార్కెట్ కు ప్రస్తుతం అవకాశం లేదని అన్నారు. అయితే మాంసాహరాన్ని ఇంటింటికి తిరిగి విక్రయించుకోవచ్చని, కాని ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని అన్నారు. అదే మాదిరిగా ప్రతీ వ్యక్తి స్వచ్చంధంగా భౌతిక దూరాన్ని పాటించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...