బాబోయ్... కరెంటు బిల్లు
వేలల్లో బిల్లులు
- అయోమయంలో వినియోగదారులు
- ఆందోళనలు చేస్తున్న టిడిపి, వామపక్షాలు
పెనవర్, భీమవరం:
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా తయారైంది లా డౌన్ కాలం. లాక్ డౌన్ కాలంలో విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులు చూస్తుంటే వినియోగదారుల గుండె తరుక్కుపోతుంది. ఎప్పుడూ వందల్లో వచ్చే బిల్లులు నేడు వేలల్లో వస్తుంటే ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. లాక్ డౌన్ కాలం... అందులోనూ వేసవికాలం.. మండే ఎండలు... దీంతో విద్యుత్ వినియోగం పెరిగింది. అయితే బిల్లులు మాత్రం పది రెట్లు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వేసవికాలాల్లోనే ఎప్పుడూ ఈ విధంగా బిల్లులు రాలేదని, ఇప్పుడు ఎందుకు ఇంత దారుణంగా బాదేస్తున్నారని వినియోగదారులు శాపనార్థాలు పెడుతున్నారు. అసలే లా డౌన్ నేపధ్యంలో తినడానికి తిండి లేక ఎంతో మంది సతమతమవుతున్నారు. ఆర్థికంగా ఎంతో నష్టాన్ని చవిచూసారు. ఇటువంటి సమయంలో కరెంటు బిల్లులను మాఫీ చేయాల్సింది పోయి, వేలలో బిల్లులకు కట్టమని ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు వచ్చింది చాలా తక్కువని, ప్రభుత్వానికి ఈ విధంగా వేలలో విద్యుత్ బిల్లులను కట్టడమే ఎక్కువని చెబుతున్నారు. ఎప్పుడూ రూ.100 నుంచి రూ.300 వరకు వచ్చే బిల్లు ఈ సారి రూ.7 వేలు దాటిందని, ఇదేమి చోద్యమని ఒక వినియోగదారుడు ప్రశ్నిస్తున్నాడు. విద్యుత్ వినియోగం పెరిగితే రెండింతలు అంటే రూ.600 వరకు బిల్లు వచ్చినా పరవాలేదని, ఇంత దారుణంగా బిల్లులు వస్తే ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాడకం మాట ఎలా ఉన్నా 80 శాతం మందికి అదనపు బిల్లులు వచ్చేశాయి. గుడెసెల్లో ఉన్న వారికి కూడా ఎక్కువగా బిల్లులు బాదేశారు. కరోనా కారణంగా మార్చి నెల రీడింగ్ తీయలేదు. రెండు నెలలు కలిపి రీడింగ్ తీశారు. దీంతో శ్లాబ్ పెరిగి విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో బిల్లులు చెల్లించాలా వద్దా అనే మీమాంసలో పడిపోయారు. వినియోగం పెరిగింది లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోవడంతో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని, ఏ నెలకు ఆ నెల కాబ్ ప్రకారమే బిల్లుల రూపకల్పన జరిగిందని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. మార్చి నెల, ఏప్రియల్ నెలలు సంబంధించి వేర్వేరుగా క్లాట్లు వేసామని, ఇందులో ఎటువంటి లోపాలు జరగలేదని చెబుతున్నారు. విద్యుత్ బిల్లులపై సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912 ని గాని, సంబంధిత విద్యుతరెవెన్యూ కార్యాలయంలోగాని సంప్రదించాలని కోరతున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు సమయాన్ని పెంచామని, ఈ నెలాఖరు వరకు బిల్లులు చెల్లించవచ్చన్నారు. అయితే అపరాధరుసుము చెల్లించే విషయంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని భీమవరం డిఈ తెలిపారు. వారి వారి కేటగిరీలకు సంబంధించి క్లాబ్ ప్రకారమే బిల్లులు జనరేట్ అవుతున్నాయన్నారు. 500 యూనిట్ల వాడకం పెరిగితే కేవలం 90 పైసలు మాత్రమే పెరుగుతుందన్నారు. అపోహలు నమ్మవద్దని చెబుతున్నారు. ఏదైనా సందేహం ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. ఆందోళనలు విద్యుత్ బిల్లులు పది రెట్లు వరకు రావడంపై తెలుగుదేశం, సిపిఎం పార్టీలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. లా డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే బిల్లులను మాఫీ చేయాల్సింది పోయి, దారుణంగా బిల్లులు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పూరి గుడెసెల్లో ఉన్నవారికి కూడా దారుణంగా బిల్లులు వేస్తారా, ఇది చాలా దారుణమంటున్నారు. వెంటనే బిల్లులను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలలకు ఒక్కసారిగా రీడింగ్ తీయడం వల్ల బిల్లు పెరిగిపోతుందని, ఈ విధానాన్ని సరిచేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment