Followers

కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన జనసేన నాయకులు 


కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన జనసేన నాయకులు 



నర్సీపట్నం, పెన్ పవర్ 


 నర్సీపట్నం మున్సిపాలిటీలోని 8, 9 నార్మల్లో ఎస్ఆర్ పిట్టా మూర్తి సౌజన్యంతో మేడేను పురస్కరించుకొని 60 కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను జనసేన నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు రాజాన వీర సూర్య చంద్ర చేతుల మీదుగా నాయకులు వంచాడ హరినాథ్, దేశెట్టి సూరి భూమి, ముత్యాల నర్సింగ్, పల్లా శ్రీను, గాలి రుణ సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సూర్య చంద్ర మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా కార్మికులు ఇంటికే పరిమితమయ్యా రన్నారు. వారికి తోడుగా జనసేన పార్టీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 8, 9 నార్మలకు చెందిన 60 కార్మిక కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇప్పటికే 8, 9 వార్మల్లో జనసేన పార్టీ తరపున కూరగాయల, పండ్లు, గుడ్లు, నిత్యావసరాలు అందజేయడం జరిగిందన్నారు. అలాగే నాయకుడు మారిశెట్టి రాజా తన సొంత నిధులలో నిరుపేదలైన 30 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వూడి కళ్యాణ్ చక్రవర్తి, అద్దేపల్లి గణేష్, వాకా రమణమూర్తి, మునికోటి విజయ్, పరవాడ మోహన్, నాగు, సురేష్, పండు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...