అంగన్వాడి టీచర్లకు పలకా అభినందనలు
అనకాపల్లి , పెన్ పవర్
కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న జీవీఎంసీ 84 వార్డుకు చెందిన 30 మంది ఆర్ పి లు , అంగన్వాడి టీచర్లల ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పలకా రవి అభినందించారు. గురువారం పలకా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారికి సహాయం చేశారు. బియ్యంతో పాటు ఐదు రకాల పప్పు దినుసులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పార్టీ నాయకులు కోరుకొండ రాఘవ, మాధురి నాయుడు, అప్పికొండ రవిశంకర్, సూరిశెట్టి వికాస్, శఠగోపం కుమార్, పలక రవి మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment