పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు
ఎంవీపీ కాలనీ, పెన్ పవర్
లాక్ డౌన్ నుండి నేటి వరకు దశల వారిగా ఫౌండేషన్ శక్తి మేరకు పలు సేవ కార్యక్రమములు చేస్తూ వచ్చింది.నేడు చిన్న వాల్తేరు లో కాపు వీధిలో హౌస్ సర్వాంట్లు లకు మరియు చిన్న వాల్తేరు 21వ వార్డు పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు 600 మందికి భోజనాలు, మజ్జిక పేకెట్స్, మాస్క్ లు. మరియు పోలీస్ వారికి గుల్గోజ్ డీ డ్రింక్స్, పత్రిక విలేకరులు, మీడియా వారికి వంట సరుకులు అందజేయడం జరిగింది. పట్టా ఫౌండేషన్ సేవా కార్యక్రమలకు ప్రోత్సహం అందించిన వారు ప్రపధముగా ఫౌండేషన్ సభ్యుయుడు పట్టా. ఉదయ్ కిరణ్, శ్రీమతి పెంటకోట. వనజ వెంకట్ గారు, గౌరీ శంకర్ గారు, మరియు నమ్మి సాయి కిషోర్, బొడ్డేడ వెంకటలక్ష్మి నాయుడు, పెంటకోట శ్రీలక్ష్మి నూకరాజు. పట్టా ఫౌండేషన్ అధ్యక్షులు పట్టా రమేష్ బాబు, ఫౌండేషన్ సభ్యులు పట్టా. ఉదయ్ కిరణ్ , జి. దేముడుబాబు, బొడ్డేడ. వెంకటలక్ష్మి , ఆర్. భారతి, పట్టా. రవి , యం. సూర్యనారాయణ, పసుపురెడ్డి. పొన్నస్వామి, సూరిబాబు... తదితరులు పాల్గున్నారు.
: బడుగు బాలహీన వర్గాల నిరుపేదలకు అండగా ఉండాలనే దృఢసంకల్పం తో పట్టా ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పట్టా రమేష్ బాబు తెలిపారు. నగరంలో వివిధ ప్రాంతలలో లాక్ డౌన్ కారణం గా పనులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్ లు పంపిణి కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా సభ్యులు పట్టా ఉదయ్ కిరణ్, పెంటకోట వనజ, వెంకట్, గౌరీ శంకర్ ల సహకారంతో చినవాల్తెర్ లో ఇంటింటికి భోజన పంపిణి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా పట్టా రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తు వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు, యాచకులకు లాక్ డౌన్ ప్రారంభం నుంచి తమ ఫౌండేషన్ ద్వారా భోజనం సదుపాయం కల్పిస్తున్నామన్నారు.పట్టా ఫౌండేషన్ ద్వారా ఇంతటి మహూన్నత కార్యక్రమం చేపట్టడం అదృష్టం గా భావిస్తున్నామన్నారు.సేవా కార్యక్రమాలు లాక్ డౌన్ ముగిసిన నిరుపేదలు పనులకువెళ్ళేవరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణ లో ఉన్న పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు కూడా సేవలందిస్తున్నామన్నారు, కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పొన్న స్వామి, సాయి కిషోర్, దేముడు బాబు, వెంకట లక్ష్మి, భారతి, రవి, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment