Followers

ప్రజాభిప్రాయమే మున్సిపల్ శాఖ పనితీరుకు కొలమానం

 


 


 


 


 


 


 


ప్రజాభిప్రాయమే మున్సిపల్ శాఖ పనితీరుకు కొలమానం -


మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధిశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ 


 


విశాఖపట్నం, పెన్ పవర్  :


 


ఆంధ్రప్రదేశ్ లో గల పట్టణ/నగరాలలో నివశిస్తున్న ప్రజల మద్దతే మున్సిపల్ శాఖలోని అధికారులు, సిబ్బంది పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధిశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు ఆయన ఎం.ఏ అండ్ యు.డి శాఖ కార్యదర్శి శ్యామలరావు సిడిఎంఏ విజయకుమార్‌తో కలసి రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లు మరియు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని, మున్సిపల్ ముఖ్య విధులైన పారిశుద్ధ్యం, రసాయనాలు చల్లించడం వంటి కార్యక్రమాలు తు.చ.తప్పకుండా చేయాలని, ప్రజలు వద్ద నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండాలని ఆదేశించారు. ఏదైనా మున్సిపాలిటీకి గాని, కార్పోరేషన్ గాని కోవిడ్ పనులు నిర్వహించడానికి నిధులు లేమి ఉంటే, తనకుగాని, మున్సిపల్ శాఖ కార్యదర్శి దృష్టిలోగాని, మున్సిపల్ శాఖ కమిషనర్ దృష్టిలోగాని పెట్టాలని సూచించారు. వేసవి కాలం నడుస్తున్నందున నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఇంజనీరింగు అధికారులను కోరారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుకుండా తగు జాగ్రత్తలు తీసుకోనడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, పెద్ద కాలువల్లో పూడిక తీయడం మే నెలాఖరులోగా పూర్తి చేయాలని కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం మున్సిపల్ పాఠశాలల్లో నిర్దేశిత కాలానికి పనులు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ పరిపాలన మరియు అభివృద్ధిశాఖా కార్యదర్శి జె.శ్యామలరావు పారిశు ద్ర్య విభాగంలో నియమించిన వార్డు కార్యదర్శులును పూర్తిగా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నం చేయాలని వారి ద్వారా పారిశుద్ధ్య పనులు విరివిగా చేపట్టి ప్రజలు నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. కోవిడ్ క్వారంటైన్ కేంద్రాల్లో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి పనులు అప్పగించరాదని, ప్రత్యేకంగా తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకొని క్వారంటైన్ కేంద్రాల్లో పనులు అప్పగించాలన్నారు. నిషేధిత ప్రాంతాల్లో పాసులు మంజూరు చేయడం వంటి విధులు, నిబంధనలు అనుగుణంగా చేపట్టాలని, ఏమైనా సమస్యలుంటే తనదృష్టికి గాని, సి.డి.ఎం.ఏ దృష్టికి గాని తేవాలన్నారు. కరోనా వ్యాధి వలన మరణించిన వారి అంత్యక్రయలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలన్నారు. సి.డి.ఎం.ఏ విజయకుమార్ ఎస్ఆర్ కె ఆర్జి మాట్లాడుతూ వార్డు వాలంటీర్లు సేవలు వినియోగించుకొని, ప్రభుత్వం ఆదేశించిన విధంగా నాలుగవ విడత గృహాల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కొన్ని మున్సిపాలిటీలు, పారిశుద్ధ్య సిబ్బంది హాజరు తక్కువగా ఉందని, గృహాల నుండి చెత్తను వేరుచేసి, సేకరణ చేయడంలో అలసత్వం కనబడుతున్నదని వీటిపై కమిషనర్లు దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ప్రభుత్వాదేశాలుసారంగా ప్రతి ఇంటిలో కల వ్యక్తికి మూడు మాస్కులు చొప్పున అందించే పనిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాబోయే కాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని తగు ప్రణాళికా సిద్ధం చేసుకోవాలని కాలువల్లో పూడికతీత మే నెలాఖరకు పూర్తి చేయాలన్నారు. జివిఎంసి కి సంబంధించి కమిషనర్ మాట్లాడుతూ కరోనా నియంత్రన గూర్చి నగరంలో చేపడుతున్న కార్యక్రమాలను ముఖ్యంగా, నిషేధిత ప్రాంతాలలో మురికివాడల్లో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, రసాయనాలు జల్లడం వంటి కార్యక్రమాలు తెలిపారు. నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉండడానికి తగు చర్యలు చేపట్టామని తెలిపారు. కాలువల్లో పూడికతీతకు గాను పరిపాలన ఆమోదం తెలిపామని చెప్పారు. రాబోయే కాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్నారు. కోవిడ్-19 నియంత్రణలో భాగంగా మెప్మా వారు అందించిన మాస్కులను నగరంలోని పౌరులకు త్వరితగతిన అందించడానికి తగు చర్యలు చేపట్టామన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు. ఇంకా ప్రజారోగ్య ఇంజనీర్-ఇన్-చీఫ్ డా.వి.చంద్రయ్య ఇంజనీరింగు పనులు పురోగతి గూర్చి వీడియో కాన్ఫరెన్సులో తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జివిఎంసి తరపున అదనపు కమిషనర్లు సోమన్నారాయణ, డా.వి.సన్యాసిరావు చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, చీఫ్ ఇంజనీరు వేంకటేశ్వరరావు, సి.ఎం.ఓ. హెచ్ డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, పిడి యుసిడి వై.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యు) ఫణిరామ్, పర్యవేక్షక ఇంజనీర్లు, జోనల్ కమిషనర్లు, విశాఖ, విజయనగరం జిల్లాల పబ్లిక్ హెల్త్ పర్యవేక్షక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.


 


 


 


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...