పాడి రైతులకు కరోనా బోనస్ అందజేసిన చుక్క
పరవాడ, పెన్ పవర్
పరవాడ మండలం:కరోనా వైరస్ నివారణా చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధం లో ఉన్న పాడి రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా విశాఖ డైరీ ముందస్తుగా ప్రకటించిన15 రోజుల పేమెంట్ ని బోనస్ గా మాజీ సర్పంచ్ చుక్క రామునాయుడు పాడి రైతులకు శుక్రవారం ఉదయం స్థానిక పాల ఉత్పత్తి కేంద్రం ఆవరణలో అందజేశారు.256 మంది పాడి రైతులకి బోనస్ అమౌంట్ కింద మూడు లక్షల 56 వేల రూపాయలు పంపిణీ చేశారు. అలాగే ఇటీవల కాలంలో పాల సోసైటీ పరిధిలో రెండు పాడి గేదలు మరణించడంతో వారికి ఇన్సూరెన్స్ రూపంలో వచ్చినటువంటి ఒక్కొక్క పాడి గేదె కి 38 వేల రూపాయలు చొప్పున మరణించిన రెండు పాడి గేదెల సంబంధించిన రైతులకు ఇన్సూరెన్స్ అమౌంట్ అందజేయడం జేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాల సొసైటీ అధ్యక్షుడు కుండ్రపు చిన్నబాబు, సొసైటీ సూపర్వైజర్లు, సొసైటీ స్టాఫ్, పాడి రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment