గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు పండ్లు పంపిణీ
(పెన పవర్, ఉలవపాడు)
ఏపీ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు వికలాంగులకు అరటి, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ పండ్లను శనివారం పంపిణీ చేశారు. సింగరాయకొండ మండలం అప్పాపురం యానాది కాలనీలో ఎపి గిరిజన యానాది సేవా సంఘము జిల్లా కమిటీ పిలుపు మేరకు మల్లవరపు శ్రీను (ఈతముక్కల) సౌజన్యముతో గర్భిణీ మహిళలకు, వికలాంగులకు అరటి, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ కాయలు 30 మందికి అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసులు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో యానాదుల సమస్యలపై పోరాడేందుకు యానాది సేవా సంఘము ముందుండేది అని అన్నారు. కరోనా ప్రభావంతో జిల్లాలో యానాదులు పడుతున్న కష్టాలకు దాతలు ముందుకు వచ్చి సహాయము చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు. జై భీం, పీపుల్స్ జెఏసి జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావు మాట్లాడుతూ యానాదులు వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉ న్నాయని, పిల్లలను చదివించుకుంటనే జీవితాలు బాగుపడతాయని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోడాల దుర్గా ప్రసాద్, యువ నాయకులూ తిరివీదుల హరి సాయి, డి.ఆంజనేయులు, పొట్లూరి శ్రీను, జై భీం పీపుల్స్ జె ఏ సి మండల ఉపాధ్యక్షులు నాని, సుబ్బారాయుడు, పి శశి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment