గ్యాస్ లీక్ బాదిత కుటుంబాలని పరామర్శించిన మంత్రులు..
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిన ఘటనలో అస్వస్థతకు గురైన కుటుంబాలను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్యెల్లే తిప్పలు నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు అదీప్ రాజ్ పరామర్శించారు. గోపాలపట్నం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వద్ద రసాయన లీక్ బాధితులకు చెక్కులను అందించగా.. పెందుర్తి లో ప్రభుత్వ ఆస్పత్రిలో 43 మందికి చెక్కులను అందించారు. అనంతరం రాజ్యాసభ సభ్యులు విజయసాయి రెడ్డి , రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర చలన చిత్ర టివి ఇండస్ట్రీ , అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారికి స్థానిక ఎమ్యెల్లే అదీప్ రాజ్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ అధ్యక్షుడు సరగడం చిన్నప్పల నాయుడు, వైఎస్ఆర్సిపి నాయకులు ఆది రెడ్డి మురళి పాల్గొన్నారు.
No comments:
Post a Comment