వైఎస్ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ పథకం ద్వారా ఖరీఫ్ సీజన్ ముందుగానే రాష్ట్రంలో 49 లక్షల 43 వేల కుటుంబాలకు 7500 రూపాయలు చొప్పున మొత్తం 3707 కోట్ల 69 లక్షల రూపాయలు ఈ నెల 15వ తేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేయనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం మంత్రి రమణయ్య పేట ఆయన క్యాంప్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్న బాబు మాట్లాడుతూ గత సంవత్సరం రైతు భరోసా పథకాన్ని ప్రారంబించి అర్హులైన ఒక్కోక్క రైతు ఖాతాలో నేరుగా 13500 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఈ నెల 15 వ తేదిన రెండోవ విడుత విడుదల చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా - పియం కిసాన్ పథకం ద్వారా జిల్లా గత సంవత్సరం 4 లక్ష 12 వేల రైతు కుటుంబాలకు 311.52 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 4 లక్షల 29 వేల కుటుంబాలకు 322 ల కోట్ల 25 లక్షల రూపాయలు జమ చేయడం జరుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం 17391 కుటుంబాలకు రైతు భరోసా లబ్ధి చేకుర్చేల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్థికంగా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యం తోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. గత సంవత్సరం మాదిరి గానే ఈ సంవత్సరం కూడ కౌలు రైతులకు రైతు భరోసా అందుతుందని మంత్రి కన్న బాబు తెలిపారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment