Followers

కేంద్ర మంత్రి ఆదేశాలు బుట్టదాఖలు 


కేంద్ర మంత్రి ఆదేశాలు బుట్టదాఖలు 



మంత్రుల మాటకు విలువ లేదా? 



స్విఘ్ ఆలో తెలంగాణ నోడల్ అధికారి ఫోన్?



 బిజీ, బిజీగా ఆంధ్రప్రదేశ్ నోడల్ అధికారి ఫోన్ ? 



(పెన పవర్, మార్కాపురం డివిజన్ ఇన్ ఛార్జి) 


కరోనా మహమ్మారితో మూడో దఫా లాక్ డౌన్ ను దేశం మొత్తం ఈ నెల 17వ తేదీ వరకు నిర్ణయించింది. అయితే ఇతర ప్రాంతాల్లో ఉండే వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులను స్వగ్రామాలకు చేరుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించి నోడల్ అధికారులను కూడా నియమించారు. అయితే సదరు నోడల్ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నోడల్ అధికారులు నియమిస్తున్నట్టు వారి ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రజలను తరలిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ నెంబర్లు పని చేయకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ నోడల్ అధికారి నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ నోడల్ అధికారి ఫోన్ నెంబర్ ఎప్పుడు చేసినా బిజీ, బిజీ అంటూ చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు, యాత్రికులు, వలస కూలీలు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తుండగా వీరి ఫోన్లు పని చేయక పోవడంతో వారికి నిరాశ కలిగిస్తుంది. స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనలకు అధికారులు విలువ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రజలు విమర్శిస్తున్నారు. నెలల తరబడి ఇతర ప్రాంతాలలో ఉంటూ తమ కుటుంబ సభ్యులను చూసుకునేందుకు తాపత్రయపడుతున్న సందర్భంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేటాయించిన నోడల్ అధికారులు ఫోన్ లు పని చేసే విధంగా చర్యలు చేపట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్మికులను, యాత్రికులను, విద్యార్థులను తమ గమ్యస్థానాలకు చేర్చే చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర డిజిపి స్వయంగా అన్ని జిల్లాల ఎస్పీల ఫోన్ నెంబర్లు ఇచ్చి ఏదైనా కష్టకాలంలో ఉంటే వారి నెంబర్లకు సంప్రదించాలని పలు ఫోన్ నెంబర్లను విడుదల చేశారు. ఆ సమయంలో కొందరు అవసరం నిమిత్తం సమాచారం పెట్టినప్పటికీ వాటిని పరిశీలించకపోవడం అన్యాయమని అంటున్నారు. ఇప్పటికైనా డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఆ నెంబర్లకు వచ్చిన సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు కూడా వలస కార్మికులు, మత్స్యకారుల తరలింపుపై చూపిన శ్రద్ధ విద్యార్థుల తరలింపుపై చూపడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులను తరలించడంలో చూపించిన శ్రద్ధ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను తరలించే విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణలో ఉన్న విద్యార్థులను ఏపీకి తరలించేందుకు శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...