క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్యమైన భోజన సదుపాయాలు
- చేతులు కడిగే అలవాటును ప్రోత్సహించాలి
కేంద్రాల నిర్వహణపై అప్రమత్తంగా వుండాలి
-ఒక కేంద్రంలో వుండే వారందరికీ ఒకేసారి పరీక్షలు జరపాలి
జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్
విజయనగరం,
: జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారికి నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. ప్రతి కేంద్రం లోను పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యెక శ్రద్ధ చూపాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ మాస్క్ లు అందజేయడం తో పాటు ప్రతి ఒక్కరు కేంద్రాల్లో వుండే సమయంలో భౌతికదూరం పాటిస్తూ సంచరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేసారు. ఈ కేంద్రాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారిని పలు తరగతులుగా వర్గీకరించి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు పరీక్షలు చేపట్టాలన్నారు. గ్రీన్ జోన్ నుండి వచ్చే వారిని ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి వీరికి క్వారంటైన్ కేంద్రంలో చేరిన వెంటనే పరీక్షలు జరిపి నెగటివ్ గా నిర్ధారణ జరిగాక హోం క్వారంటైన్ కు పంపించవచ్చని పేర్కొన్నారు. ఆరంజ్, రెడ్ జోన్ ల నుండి వచ్చే వారిని కొద్ది రోజులపాటు కేంద్రంలో ఉంచిన తర్వాత వారికి పరీక్షలు జరిపి ఇంటికి పంపించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిని కుడా ఆయా రాష్ట్రంలో కరోనా కేసుల ఆధారంగా కేంద్రంలో కొన్ని రోజుల పాటు ఉంచిన తర్వాత పరీక్షలు జరిపించాలని సూచించారు. ఎక్కువ రోజులుగా కేంద్రాల్లో ఉంటున్న వారికి తొలుత పరీక్షలు జరిపి వారిని పంపించాలని చెప్పారు. ఒక కేంద్రంలో వుండే వలస కులీలందరికీ ఒకేసారి పరీక్షలు జరపాలని చెప్పారు. ఆయా మండలాల వైద్యాధికారులు, ప్రొగ్రమ్ అధికారులు ఆయా కేంద్రాల్లో తహసీల్దార్లతో చర్చించి టెస్ట్ లు జరపాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు నోడల్ అధికారులుగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామరాజు, ఎస్.సి.కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ జి.జగన్నాధంలను నియమించామన్నారు.
No comments:
Post a Comment