Followers

ముఖ్యమంత్రి జగన్ చర్యలు ప్రశంసనీయం...

 ముఖ్యమంత్రి జగన్ చర్యలు ప్రశంసనీయం...


ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్


భీమవరం,పెన్ పవర్ 


భీమవరం, కరోనా వైరసను రాష్ట్రంలో అరికట్టడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ కరోనా వైరస్ పరీక్షలు ఎక్కడికక్కడ జరిగేలా కిట్లు పంపించి నిత్యం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి అండగా తాము సైతం అంటూ ప్రతీ ఒక్కరూ స్పందించి ముందుకు వస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం వీరవాసరం మండలానికి చెందిన పలువురు పార్టీ నాయకులు స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ లో వీరవాసరం మండలంలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అందించడం అభినందనియమని అన్నారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి మండలంలోని ప్రతీ గ్రామంలోనూ కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పార్టీ నాయకులను అభినందిస్తున్నానని అన్నారు. తోలేరు గ్రామ మాజీ సర్పంచ్, వైసిపి నాయకులు భోగిరెడ్డి శ్రీనివాసరావు రూ లక్ష, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగరాజు శ్రీనివాసరాజు రూ 54 వేలు, పార్టీ సీనియర్ నాయకులు గొలగాని సత్యనారాయణ రూ 51 వేలు , క్రిస్టి లూధరన్ చర్చి నుండి కె వినోద్ కుమార్ రూ 10 వేల చెక్కులను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి వీరిని ప్రత్యేకంగా అభినందించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...