భీమవరంలో మళ్ళీ ఆంక్షలు కఠినతరం
- ఇబ్బందులు పడ్డ ప్రజలు
- ఆసుపత్రికి వెళ్ళాలంటే 10 కిమీ తిరిగి వెళ్ళాల్సిందే
- పోలీసుల తీరుపై విమర్శలు
పెనవర్, భీమవరం:
గత కొన్ని రోజులుగా లాన్ ఆంక్షలపై చూసీ చూడనట్లుగా వ్యవహరించిన పోలీసులు నేడు మళ్ళీ ఆంక్షలను కఠినతరం చేశారు. దీంతో ఎప్పటిలాగానే ఆసుపత్రులకు, ఇతర పనుల నిమిత్తం భయటకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లా డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల మన్ననలు పొందిన పోలీసులు నేడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు కఠినతరం చేయడంతో ఆసుపత్రులకు వైద్యం నిమిత్తం వెళ్ళేవారు చాలా ఇబ్బందులు పడ్డారు. బుధవారం ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్లలో ఒకే మార్గం ద్వారా ప్రజలు రాకపోకలు సాగించే సమయంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గురువారం పోలీసులు నిబంధనలకు కఠినతరం చేశారు. భీమవరం వన్ టౌన్ ప్రాంతం నుంచి టూటౌను వెళ్ళాలంటే ప్రకాశంచౌక్ - అంబేద్కర్ సెంటర్ల మధ్య ఉన్న యనమదుర్రు డ్రెయిన్ వంతెనపై నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే లాక్ డౌన్ నేపధ్యంలో ఒక వంతెన నుంచే ప్రజలను వదులుతున్నారు. వటౌన్ నుంచి ఆసుషత్రులకు వెళ్ళాలంటే టూటౌన్ కు వెళ్ళాల్సిందే. ప్రస్తుత పోలీస్ ఆంక్షల నేపధ్యంలో వంతెసనై రాకపోకలకు అభ్యంతరాలు తెలిపారు. కొన్ని విభాగాలకు చెందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వారితో పాటు పలు వాహనాలను అనుమతిస్తున్నారు. గురువారం ఆసుపత్రులకు వెళ్లే వారిని అటుగా అనుమతించకపోవడం వల్ల వారు 10 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది. వన్ నుంచి టూటౌనకు సర్పయ్య అగ్రహారం, బైపాన్‌రోడ్డు, ఉండి రోడ్డు రైల్వేగేటు మీదుగా టూటౌన్ చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. భీమవరం వటౌన్ ఎస్పై వెంకటేశ్వరరావు అతిగా ప్రవర్తించారని, దీంతో ఆసుషత్రులకు వెళ్ళే చిన్నారులను 10 కిలోమీటర్లు ఎండలో తిప్పి తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భీమవరం ప్రస్తుతం ంగా ఉందని, అందువల్లే ఈ ఆంక్షలు అని అధికారుల చెబుతున్నారు. చాలా చోట్ల నడలింపులు చేస్తున్నారని, దుకాణాలను కూడా తెరుస్తున్నారని, అయితే భీమవరంలో ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తణుకు వంటి ప్రాంతాల్లో దుకాణాలను తెరుచుకునే అనుమతి ఇచ్చారని, జాగ్రత్తలు పాటించి వ్యాపారాలను నడుపుకునే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. భీమవరంలో కరోనా పాజిటివ్ వచ్చిన కొంతమంది ఏలూరులో క్వారంటైన్లో ఉన్నారని, వారికి నెగిటివ్ వచ్చి ఇక్కడకు తిరిగి వచ్చే వరకు రెజోన్ ని ఆరెంజ్ గా ప్రకటించే అవకాశాలు లేవని చెబుతున్నారు. అయితే క్వారంటైన్లో ఉన్న వారికి 14 రోజులు పూర్తయ్యిందని, వారికి పరీక్షలు నిర్వహించి వెంటనే పంపించే ఏర్పాటు చేయాలని భీమవరం ప్రజలు కోరుతున్నారు. నాల్గొవ దశ లా డౌన్లో సడలింపులు ఇచ్చే సమయంలో పోలీసులు ఈ విధంగా కఠినంగా వ్యవహరించడం దారుణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు ఆర్ధికంగా ఎంతో నష్టపోయారని, ఎంతో ఓపికతో ఉన్నారని, ఈ సమయంలో వారిని ఇంకా ఇబ్బందులకు గురిచేయడం దారుణమని చెబుతున్నారు. భీమవరంలో ఉన్న రెండు రెడ్ జోన్లలో ప్రజలు పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. ఎన్ని రోజులు ఇంకా రెజోన్లోనే మగ్గాలని, కోలుకున్న వారిని త్వరగా రప్పించి, తమకు విముక్తి కలిగించాలని కోరుతున్నారు. భీమవరంలో గురువారం కఠినతరం కఠినతరం చేయడంతో ద్వారా గురువారం అంబేద్కర్
No comments:
Post a Comment