Followers

పారిశుధ్య పనులలొ గణాంకాలను సాంకేతికంగా మెరుగుపర్చండి


పారిశుధ్య పనులలొ గణాంకాలను సాంకేతికంగా మెరుగుపర్చండి



జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన 



విశాఖపట్నం, పెన్ పవర్ :



 జివిఎంసి పరిధిలో జరుగుచున్న పారిశుద్ధ్య పనులు యొక్క గణాంకాలను, సాంకేతిక పద్దతులు ద్వారా చూ పెట్టాలని, అప్పుడే విశాఖనగరాభివృద్ధి సంస్థ చేస్తున్న పారిశుద్ధ్య కార్యకలాపాల ప్రగతి రాష్ట్రంలో కనబడుతుందని, కమిషనర్ పారిశు ధ్య విభాగపు అధికారులకు ఉద్బోదించారు. పారిశుద్ధ్య విభాగపు ఉన్నతాధికారులు అదనపు కమిషనర్, ముఖ్య ఆరోగ్య వైద్యశాఖాధికారి సమక్షంలో జోనల్ కమిషనర్లతోను, అసిస్టెంటు మెడికల్ ఆపీసర్లతోను శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా పారిశుద్ధ్య విభాగపు పనితీరు పై సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ముఖ ఛాయ గుర్తింపు” (పేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) పద్ధతి ద్వారా పారిశుద్ధ్య కార్మికులు హాజరును చేపట్టాలని ప్రస్తుతం చాలా వార్డులలో ఈ విధానం ద్వారా హాజరును రాబట్టే శాతం తక్కువగా ఉందని గావున, రాబోయే వారంలో ఈ పద్ధతి ద్వారా హాజరు తీసుకోవడం 90 శాతం పైన పురోగతి సాధించాలని ఆదేశించారు. ఇండ్ల నుండి నేరుగా చెత్తను సేకరించే పద్ధతిని సాంకేతికంగా మధించడానికి ప్రవేశపెట్టిన “ఆన్లైన్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్” అనే పద్ధతిలో కూడా వెనుకబాటు తనం కనబడుచున్నదని గావున ఈ విధానంలో కూడా పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ పనులు నిర్వర్తించడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావాలి గాని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే, తీవ్ర చర్యలు గైకొంటామని హెచ్చరించారు. వార్డు శానిటరీ కార్యదర్శులును, మైక్రోపాకెట్లు విధానానికి అనుసంధానం చేసి బాధ్యతలు అప్పచెప్పాలని, అప్పుడే తడి, పొడి చెత్త గృహాల వద్ద వేరు చేసి సేకరించడంలో పురోగతి సాధిస్తామన్నారు. వార్డు ఎమినిటీస్ కార్యదర్శికి ఆయా వార్డుల్లో తిరుగుచున్న పారిశుద్ధ్య వాహానాలు, పుష్ కార్డుల బాధ్యత అప్పజెప్పాలన్నారు. నగరంలోని వీధుల నుండి డంపింగ్ యార్డుకు తరలిస్తున్న డంపర్ బిన్ను యాప్ ద్వారా ప్రతీ రోజు చూపెట్టాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు సూచించారు. బహిరంగ మల మూత్ర విసర్జనలు చేసిన వారి పై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసిన వారి పై, చెత్తను రోడ్డు పై పారబోసే గృహా, వాణిజ్య యజమానులు పై జరిమానాలు విస్తృతంగా విధించాలని, అప్పుడే ప్రజల్లో క్రమశిక్షణ వచ్చి, అంటురోగాలు ప్రబలుకుండా జాగ్రత్తపడతారని జోనల్ కమిషనర్లకు, ఎ.ఎం.ఓ. హెలకు తెలిపారు.  ఇటీవల వార్డు వాలంటీర్లు ఎంపికకు మౌఖిక పరీక్షలు పూర్తయినందున, వెంటనే ఎంపికయిన వారికి ఉత్తర్వులు మంజూరు చేయాలని అందరు జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు, సి.ఎం.ఓ. హెచ్ డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్లు, అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...