పారిశుద్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
మాకవరపాలెం,పెన్ పవర్
పిఆర్‌టియు మీ సేవకు మా సలాం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ జరుగుతుంది. దీనిలో భాగంగా శనివారం మాకవరపాలెం మండలంలోని మాకవరపాలెం తామరం, కొత్తపాలెం, లచ్చన్న పాలెం, పెద్దిపాలెం, చామంతిపురం, వెంకటాపురం గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులు పేదవారికి ఒక్కొక్కరికి 500 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. మాకవరపాలెం మండలంలో 70 మంది పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా పిఆర్‌టియు అధ్యక్షులు గోపీనాథ్, ఎస్పై కరక రాము, వాసు, హరిబాబు చేతుల మీదుగా జరిగింది. మాకవరపాలెం మండలంలో పనిచేస్తున్న పిఆర్‌టియు యూనిట్ ఉపాధ్యాయులు 60 మంది చేసిన ఆర్థిక సాయం 35వేల రూపాయలతో 70 మందికి కిట్ల పంపిణీ జరిగిందరి మండల పిఆర్‌టియు అధ్యక్షులు కె. రాము వివరించారు. ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు సాయానికి ఉపాధ్యాయులు ఎప్పుడు ముందు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిహెచ్.గోవిందు, జిల్లా ఉపాధ్యక్షులు కె.త్రిమూర్తులు కె.మోహన్, కఅష్ణారావు, లోవరాజు, రాజేష్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment