కార్మికుల కోర్కెల దినోత్సవం సందర్భంగా
కోర్కెలు తీర్చాలటు ప్లకార్డులు ప్రదర్శన..
సి ఐ టి యు ,కార్మిక సంఘాల నాయకులు..
పోలవరం : పెన్ పవర్
సిఐటియు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికుల కోరికల దినోత్సవాన్ని పురష్కరించుకొని గురువారం పోలవరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ, ఆశ వర్కర్లు , పంచాయతీ కార్మికులు అందరూ కలిసి తమ కోరికలు నెరవేర్చాలని కోరుతూ ప్లకార్డుల తో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ టి యు ఏపీ ల్యాండ్ జిల్లా కమిటీ సభ్యులు గుడెల్లి వెంకట్రావు, సిఐటియు పోలవరం మండల కార్యదర్శి అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు పి ఎల్ ఎస్ కుమారి లు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కరోనా విజృంభించిన వేళ పంచాయతీ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది అత్యవసర సేవలు చేస్తూ కరోనా నియంత్రణకు ఎంతో కృషి చేస్తున్నారని కానీ ప్రభుత్వపరంగా కరోనా నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన రక్షణ పరికరాలు ఇవ్వడంలేదని విమర్శించారు. పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు 10,500 రూపాయలు ఇవ్వాలని కోరుతూ జీవోలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని, ఆశ, అంగనవాడి, మిడ్ డే మీల్స్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేసి కనీస వేతనం 21 వెయ్యి రూపాయలు ఇవ్వాలని ,కరోనా వ్యాధి నివారణ చర్యల్లో విధులు నిర్వహిస్తుండగా కరోనా వ్యాధి సోకి చనిపోయిన కార్మికులకు ,ఉద్యోగులకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, కరోనా వైరస్ నిర్ములన విధుల్లో ఉన్న పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్స్ తదితరుల అందరికీ ప్రత్యేక అలవెన్సులు గా నెలకు పాతిక వేల రూపాయలు ఇవ్వాలని, కరోనా నియంత్రణ విధులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదిస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ పది గంటలు పెంచాలని చూస్తుందని అన్నారు. 10 గంటలు పని వద్దు ఎనిమిది గంటల పని ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, పోలవరం మండలం పంచాయతీ సిబ్బంది,ఆశా వర్కర్లు,అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment