ఉమర్ ఆలీషా ట్రస్ట్ ద్వారా పారిశుధ్య కార్మికులకు లక్ష రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణి
ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ , పిఠాపురం వారి ఆధ్వర్యంలో కోవిడ్ 19 మహమ్మారిని నిరోధించుటకు నిరంతరము శ్రమిస్తున్న జీవీఎంసీ భీమిలి జోన్ లో పని చేయుచున్న 150 మంది పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణి చేయడము జరిగినది . భీమిలి పరిధి లో పని చేస్తున్న 60 మంది పారిశుధ్య కార్మికులకు భీమిలి రేల్లివీది నందు, తగరపువలస పరిధి పనిచేస్తున్న 90 మంది పారిశుధ్య కార్మికులకు సంతపేత గ్రామసచివాలయం నందు ఈ కార్యక్రమం నిర్వహింపబడింది. భీమిలి బీచ్ లో ఉన్న 12 మంది జెయింట్ వీల్ వలస కార్మికులకు వంట నూనె, గోధుమపిండి కుడా పంపిణ చేయడమైనది. ఈ సందర్భముగా భీమిలి మునిసిపల్ జోనల్ కమీషనర్ గోవిందా రావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులందరికి కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు ఉమర్ ఆలీషా ట్రస్ట్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ డా. ఆనంద కుమార్ పింగళి మాట్లాడుతూ "ట్రస్ట్ చైర్మన్ డా. ఉమార్ ఆలీషా ఆదేశాల మేరకు ఉభయ తెలుగు రాష్టాలలో తమ వాలంటీర్స్ ద్వారా కరోనా పై అవగాహన కార్యక్రమములు నిర్వహిస్తూ మరియు ఉచితముగా 16 లక్షల మందికి వ్యాధి నిరోధక శక్తి పెంపొందిప చేసే హోమియా మందులు పంపిణి చేశామని , అలాగే సుమారుగా 16 వేల మాస్కులు కుట్టించి పంపిణి చేశామని అన్నారు. అవసరమైన చోట్ల భోజనము పాకెట్స్ మరియు నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్నామన్నారు. ఈ రోజు భీమిలిలో సుమారు లక్ష రూపాయలు విలువ చేసే మొత్తము 17 నిత్యావసర సరుకులు, పంపిణి చేయడము జరిగిందన్నారు. " ఈ కార్య కార్యక్రమములో భీమిలి మునిసిపల్ జోనల్ కమీషనర్ గోవిందా రావు , TPRO శ్రీనివాస రావు , సానిటరీ ఇనస్పెక్టర్ బి. ఎం నాయుడు, మరియు మునిసిపల్ సిబ్బంది, ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ డాక్టర్ ఆనంద కుమార్ పింగళి , పి. మంజుల, కె. ప్రసాద రెడ్డి, శివ రెడ్డి, ఎం . మురళీధర్ , రవి పాల్గొన్నారు.
No comments:
Post a Comment