కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ ఆకలి కేకలు......
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
రాష్ట్ర వ్యాప్తంగా 3729 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ , ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం వీరి సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేది. గడిచిన సంవత్సరం నుండే 10 రోజుల వ్యవధి తో 12 నెలలకు జీతాలు వొచ్చెల ఇప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జీవితంలో ఆనందం వెరిసింది. దీని ప్రకారం ఈ సంవత్సరం ఏప్రియల్ 1 తేదీ నుండి వీరి సేవలు పునారుర్దింపబ డాలి. కానీ దీని నిమిత్తం ప్రభుత్వం నుండి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. జీతాలు లేక కుటుంబ పోషణ కు ఒప్పంద గురువులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పంద అధ్యాపక సంగం పిలుపు మేరకు ప్రస్తుత సమస్యలు తెలిపేందుకు విద్యాశాఖ మంత్రి శ్రీ. ఆదిములపు సురేష్ మెయిల్ కు ప్రతీ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆర్జీ ని ఈ రోజు పంపారు.మరి కొంత మంది 1902కి ఫోన్ చేసి సమస్య వివరించారు. ఇందులో నాన్ సంక్షన్ లో పని చేసే అధ్యాపకులకు దాదాపుగా 8నెలల నుండి జీతాలు లేదు. వీరి సమస్యలు తొందరగా పరీక్షించాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఒప్పంద అధ్యాపకుల సంగం వినయ పూర్వకం గా కోరుతున్నది. కరోనా నేపధ్యం లో పరిస్తితి ని అర్దం చేసుకొని ఒప్పంద అధ్యాపకుల ఆకలి తీర్చమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
No comments:
Post a Comment