దాతలకు కృతజ్ఞతలు..
ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్
భీమవరం, పెన్ పవర్
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండటానికి ముందుకు వస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎంఎలు గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి సహయ నిధి నిమిత్తం పలువురు ప్రముఖులు స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విరాళాల రూపంలో చెక్కులను ఎంఎల్ప గ్రంధి శ్రీనివాస్ కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం బాధ్యతగా పని చేస్తుందని, ఎక్కడికక్కడ కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే మాదిరిగా లాక్ డౌన్ లో ప్రజలు ఇబ్బందులు పడకుండా మూడు దఫాలుగా బియ్యం, కందిపప్పును కూడా అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని అన్నారు. చిన అమిరం గ్రామానికి చెందిన భాసిని డవలపర్స్ అధినేతలు కొల్లి నరిసింహమూర్తి, చికిలే సత్యానందం, ఆరేటి పద్మారావులు రూ లక్ష వెయ్యి 116 ల చెక్కును ఆ గ్రామ మాజీ సర్పంచ్ గొట్టుముక్కల సత్యనారాయణరాజు (ధర్మరాజు) ఆధ్వర్యంలో అందించారు. పట్టణానికి చెందిన టాక్సీ ఓనర్స్ అసోషియోషన్ అధ్యక్ష, కార్యదర్శులు వేగి భగవాన్ నారాయణ, మోటుపల్లి వెంకటరత్నంలు రూ 30 వేల చెక్కును, పట్టణానికి చెందిన ఆర్ పిలు రూ 20 వేలు చెక్కును అందించారు. ఈ సందర్భంగా దాతలకు ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment