ఐకాన్ ట్రస్టు ఆధ్వర్యంలో హిజ్రాలకు నిత్యావసరాలు పంపిణీ
(పెన్ పవర్, గిద్దలూరు)
లాక్ డౌన్ వల్ల పనిలేక అవస్థలు పడుతున్న హిజ్రాలకు ఐకాన్ ఛారిటబుల్ ట్రస్టు సేవా సైనికులు నిత్యావసర వస్తువులు శనివారం అందజేశారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల నిర్బందించిన విషయం మనందరికీ తెలిసిందే. లాక్ డౌన్ వల్ల రోజూ షాపులు నడుస్తుంటే డబ్బులు వసూలు చేసుకుని జీవనం సాగించే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేనందున నిరుపేద హిజ్రాల కుటుంబాలు పూట గడవటం కష్టంగా మారింది. ఆకలి కేకలు వేస్తున్నప్పటికీ వారిలో చాలా మంది నోరు విప్పి అడగలేని పరిస్థితి ఉంది. అటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి నిత్యావసర సరుకులు అందించటం జరిగిందని ట్రస్టు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఐకాన్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు చీమలదిన్నె శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు చేతనైనంత సహాయం చేసి ఆపదలో ఉన్న వారికి తమవంతు సహాయపడి ఆదుకోవాలి అన్నదే యువకేర్ వారి సేవా కార్యక్రమాల సారాంశమని అన్నారు. తమ సొంత నిధులతో నిత్యావసర వస్తువులను పంచటం జరిగిందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చీమలదిన్నె శ్రీకాంత్ బాబు, ఉపాధ్యక్షులు యడవల్లి బాలు, గౌరవ సలహాదారులు అరికెరీ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment