గర్భిణీలకు శ్రీమంతాలు
ఆత్రేయపురం, పెన్ పవర్
గర్భిణీలు స్త్రీలు మంచి బలమైన పౌష్టిక ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని పొందాలని కొత్తపేట శాసనసభ్యులు రాష్ట్ర పి యు సి చైర్మన్ చిర్ల జగ్గరెడ్డి కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో రావులపాలెం ఆత్రేయపురం కొత్తపేట ఆలమూరు మండలాల్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ముందుగా రావులపాలెం ర్యాలీ గ్రామంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని అనేక రకాల పళ్ళ తో కలిగిన కిట్లను గర్భిణీలకు అందించారు అనంతరం శ్రీమంతం నిర్వహించి అక్షింతలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని ఇందులో భాగంగానే నియోజకవర్గంలో 27 వేల మందికి అనేక రకాల పళ్లను వారికి అందించి అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే ఇవే కాకుండా దాతలు కార్యకర్తల సహకారం తో వారు తినే వివిధ రకాలు వేరుశనగ అచ్చులు ఇటువంటివి అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక పథకాలు నెరవేర్చే విధంగా ముందుకు సాగుతున్నారని అన్నారు . ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడటం చాలా బాధాకరమని అన్నారు. అయితే ప్రజల సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకుంటే కరుణ మహమ్మారిని అరికట్టవచ్చునని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాతి బుజ్జి అంగన్వాడీలు టీచర్లు ఆయాలు వైద్య సిబ్బంది అధికారులు నాయకులు కార్యకర్తలు గ్రామనాయకులు బోనం సాయిబాబు కప్పాల శ్రీధర్ ప్రజలు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment